Site icon NTV Telugu

Britney Spears Marriage: తనను తానే పెళ్లి చేసుకుని.. హనీమూన్‌కు వెళ్లిన బ్రిట్నీ స్పియర్స్!

Britney Spears Marriage

Britney Spears Marriage

అమెరికా ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ (42) తన భర్త సామ్ అస్ఘరీ (30) నుంచి ఇటీవల విడిపోయిన విషయం తెలిసిందే. బ్రిట్నీ, అస్ఘరీలు 2022లో వివాహం చేసుకోగా.. 14 నెలల వ్యవధిలో వారి పెళ్లి బంధం ముక్కలైంది. 2023లో విడాకుల కోసం ఈ జంట దరఖాస్తు చేసుకోగా.. గత మే నెలలో డివోర్స్ ఒప్పందానికి వచ్చింది. అయితే బ్రిట్నీ తాజాగా ఇన్‌స్టాలో చేసిన ఓ పోస్టు అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.

తనను తానే పెళ్లి చేసుకున్నానని బ్రిట్నీ స్పియర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. ‘నన్ను నేనే పెళ్లి చేసుకున్న రోజు ఇది (అక్టోబరు 21). ఇది మీకు చాలా ఇబ్బందిగా, తెలివితక్కువ పనిగా అనిపించవచ్చు. కానీ నా జీవితంలో నేను చేసిన అద్భుతమైన పనిగా భావిస్తున్నా’ అని ఆ పోస్టులో రాసుకొచ్చారు. ఈ పోస్టుకు పెళ్లిగౌను ధరించిన పోటోలను, వీడియోను షేర్ చేశారు. వీడియోలో నవవధువులా నిలబడిన బ్రిట్నీ పక్కన వరుడు ఎవరూ లేరు. అంతేకాదు ఖాళీగా ఉన్న చర్చి ఫొటోను షేర్‌ చేశారు.

Also Read: IND vs NZ 2nd Test: దాచడానికేమీ లేదు.. రాహుల్-సర్ఫరాజ్‌ మధ్య పోటీ ఉంది: కోచ్‌

బ్రిట్నీ స్పియర్స్ మరో పోస్ట్ కూడా చేశారు. ఒంటరిగా హనీమూన్‌కు బయలుదేరుతున్నట్లు విమానం పక్కన నిలబడి ఉన్న ఫొటో పెట్టారు. ‘టక్స్‌ అండ్‌ కేకస్.. నేను వచ్చేశా’ అని పేర్కొన్నారు. టక్స్‌ అండ్‌ కేకస్‌ అంటే దీవులు. ఇవి అట్లాంటిక్‌ సముద్రంలో ఉన్నాయి. బ్రిట్నీ పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విషయం తెలిసిన వారు షాక్ అవుతున్నారు. 42 ఏళ్ల బ్రిట్నీకి ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. ఇప్పుడు నాలుగో పెళ్లి అన్నమాట.

Exit mobile version