పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కె. ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో అంచనాలు వున్నాయి.ఈ సినిమాకు దర్శకత్వ పర్యవేక్షకుడిగా సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు పని చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడానికి కొన్ని సలహాలు కూడా ఆయన ఇవ్వడం జరిగింది.. ప్రాజెక్ట్ కే సినిమాలో దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ వంటి భారీ స్టార్ క్యాస్ట్ నటిస్తుండటంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి.విశ్వనటుడు కమల్ హాసన్ ఈ సినిమాలో నటించడానికి సింగీతం శ్రీనివాసరావు గారు కారణమని తెలుస్తుంది.సింగీతం కమల్ కాంబినేషన్ లో పలు బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కిన నేపథ్యంలో ఆయన కోరిన వెంటనే కమల్ ఈ సినిమాలో నటించడానికి అంగీకరించారని సమాచారం. తాజాగా ప్రాజెక్ట్ కె సినిమా కొరకు కట్ చేసిన గ్లింప్స్ ను చూసిన సింగీతం నా 66 సంవత్సరాల సినీ కెరీర్ లో ఇలాంటి గ్లింప్స్ చూడలేదని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రాజెక్ట్ కె సినిమా అద్భుతం అంటూ సింగీతం శ్రీనివాసరావు గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.ఈ నెల 20వ తేదీన ప్రాజెక్ట్ కె సినిమాకు సంబంధించి ముఖ్యమైన అప్ డేట్స్ రానుంది.ప్రాజెక్ట్ కే కమర్షియల్ గా భారీ విజయం సాధిస్తుంది అని చిత్ర యూనిట్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉంది.ప్రాజెక్ట్ కె సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉండనున్నట్లు సమాచారం.. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఎంతో గ్రాండ్ విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తముగా వున్నా ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ మోడరన్ విష్ణు మూర్తి గా కనిపించబోతున్నట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ కెరీర్ కు ఈ సినిమా ఎంతో కీలకం కానుంది.ఈ సినిమా విడుదల అయిన తరువాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.