Site icon NTV Telugu

Singareddy Satish Reddy: ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జగన్ నైజం…

Singareddy Satish Reddy

Singareddy Satish Reddy

Singareddy Satish Reddy: ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నైజం అన్నారు శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి.. కడప జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎవరు అడిగినా హామీలు ఇచ్చి వాటిని మరిచిపోవడం చంద్రబాబుకు అలవాటు అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో చంద్రబాబుకు టిడిపికి గ్రాఫ్ పడిపోతోంది.. చంద్రబాబు నాయుడు ఏ మేనిఫెస్టోను సాధ్యం కాదు అన్నాడో, దానిని జగన్ సుసాధ్యం చేశాడని తెలిపారు. 2014లో జగన్ ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేసిన విధానమే ఆయన విజయానికి మూలంగా పేర్కొన్న ఆయన.. ఓట్ల కోసం సీట్ల కోసం చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.

Read Also: Sreenivasa Prasad: కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్‌ కన్నుమూత

ఇక, షర్మిల తన ప్రత్యర్థులతో కలిసి ప్రచారం చేస్తుంది.. బీజేపీతో చేతులు కలిపిందని ఆరోపించారు సతీష్‌ రెడ్డి.. చంద్రబాబు నాయుడు బీజేపీతో చేతులు కలపడం కోసం పంచన కాపు కాశారు.. అయినా బీజేపీ పెద్దలు చంద్రబాబునాయుడును నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. మేనిఫెస్టో ప్రకటన తర్వాత జగన్ పై ప్రజలకు విశ్వసనీయత పెరిగింది.. పులివెందులలో జగన్ భారీ మెజార్టీతో గెలుపొందుతారని వెల్లడించారు. పులివెందులలో, కడప జిల్లాలో టీడీపీపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిందంటూ వ్యాఖ్యానించారు శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి.. కాగా, ఎన్నికల తరుణంలో టీడీపీకి షాకిచ్చిన సతీష్‌రెడ్డి.. హైకమాండ్ అండ లేకుండా టీడీపీలో కొనసాగే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం వితమే.

Exit mobile version