Site icon NTV Telugu

AP and Singapore: ఏపీతో సంబంధాలపై సింగపూర్‌ మంత్రి కీలక ప్రకటన..

Ap And Singapore

Ap And Singapore

AP and Singapore: ఆంధ్రప్రదేశ్‌తో.. ముఖ్యంగా రాజధాని అమరావతి అభివృద్ధిలో సింగపూర్‌ భాగస్వామ్యం ఉంటుందా?.. లేదా? అనే ఉత్కంఠకు తెరపడినట్టు అయ్యింది.. సింగపూర్‌తో సంబంధాలు బలోపేతమే లక్ష్యంగా పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కీలక ప్రకటన చేశారు.. ఆ దేశ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ మంత్రి టాన్సీ లెంగ్.. సింగపూర్‌ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు సింగపూర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మంత్రి.. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేస్తూ.. ఏపీ, అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం కొనసాగుతుందని తెలిపారు టాన్సీ లెంగ్.. సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన ఫలప్రదం కావాలని ఆకాంక్షించారు.. భారత్ లో అత్యంత వేగంగా ఎదుగుతున్న రాష్ట్రాల్లో ఒకటైన ఏపీలో పెట్టుబడులు, కార్యకలాపాల విస్తరణకు సింగపూర్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని వెల్లడించారు.. పోర్టులు, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ టెక్నాలజీ , నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులపై సీఎం చంద్రబాబుతో చర్చించినట్టు సింగపూర్ మంత్రి టాన్ సీ లెంగ్ ప్రకటించారు..

Read Also: Srushti Test Tube Baby Centre: సృష్టి టెస్ట్ ట్యూబ్ కేసులో కొత్త కోణం.. ప్లాన్ మామూలుగా లేదుగా

ఇక, 2014-2019లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి నాటి ప్రభుత్వంతో కలిసి పని చేశామని గుర్తుచేసుకున్న సింగపూర్ మంత్రి టాన్సీ లెంగ్.. మాస్టర్ ప్లాన్ రూపకల్పన, నిర్మాణ సహకారాన్ని అందించినట్టు గుర్తు చేశారు.. అమరావతిలో స్టార్టప్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సింగపూర్ కంపెనీలు స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్ కూడా దక్కించుకున్నాయన్నారు.. 2019లో ప్రభుత్వం మారాక ఒప్పందంలో కొనసాగేందుకు సహకారం ఆగిపోయిందని.. ఆ కారణంగానే అమరావతి ప్రాజెక్టు నుంచి సింగపూర్ కన్సార్టియం బయటకు వచ్చేసిందని వ్యాఖ్యానించారు.. గత అనుభవాల కారణంగా సీడ్ క్యాపిటల్ విషయంలో సింగపూర్ కన్సార్టియం పని చేయకున్నా.. అమరావతిలో, ఏపీలో పట్టణాభివృద్ధి సహా వివిధ రంగాల్లో అభివృద్ది ప్రణాళికల్లో కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు సింగపూర్‌ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ మంత్రి టాన్సీ లెంగ్..

Exit mobile version