NTV Telugu Site icon

Minister RK Roja: త్వరలోనే చంద్రబాబు అరెస్ట్.. సింగపూర్‌లో చిప్పకూడు పెడతారు..!

Rk Roja

Rk Roja

Minister RK Roja: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు మంత్రి ఆర్కే రోజా.. త్వరలోనే చంద్రబాబును సింగపూర్ పోలీసులు అరెస్ట్ చేస్తారని వ్యాఖ్యానించారు. అమరావతిలో చంద్రబాబు అనేక కుంభ కోణాలు చేశారని ఆరోపించిన ఆమె.. సింగపూర్‌లో చంద్రబాబు పార్ట్‌నర్‌ ఈశ్వరన్ అవినీతిలో దొరికారు.. ఆయన్ని మంత్రి వర్గం నుంచి తొలగించి విచారణ చేస్తున్నారని తెలిపారు.. స్విస్ ఛాలెంజ్ పేరుతో అమరావతి భూములతో చీకటి ఒప్పందాలు సింగ్‌పూర్‌లో చేసుకున్నారని పేర్కొన్న ఆమె.. త్వరలోనే చంద్రబాబుని సింగపూర్ పోలీసులు అరెస్ట్ చేసి చిప్పకూడు పెడ్తారంటూ వ్యాఖ్యానించారు.. అందుకే, ఆ భయంతోనే చంద్రబాబు ఇంటి నుంచి బయటకు రాకుండా వణికిపోతున్నారని చెప్పుకొచ్చారు మంత్రి ఆర్కే రోజా..

Read Also: Sukumar: ఆ రంగంలో ఇంట్రెస్ట్.. కూతుర్ని అమెరికా తీసుకెళ్తున్న సుకుమార్

మరోవైపు, చంద్రబాబు, పవన్‌ పై మంత్రి రోజా మండిపడ్డారు. చంద్రబాబు పూనిన చంద్రముఖిలా పవన్‌ పిచ్చిగంతులేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. పవన్‌ కల్యాణ్‌ కళ్యాణ్‌ ఓ పనికిమాలినవాడు. పవన్‌ను లాగి కొట్టాలనిపిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి పవన్ గౌరవం ఇవ్వాలని సూచించారు. పవన్ ప్రజల్లోకి వచ్చి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడని.. కానీ, పవన్ ను ప్రజలే తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఇక, సీఎం వైఎస్‌ జగన్‌కు సంస్కారం నేర్పాలని పవన్ అంటున్నారు.. ఈ మాటలు వింటుంటే సన్నీ లియోన్ వేదాలు చెప్పినట్టు ఉందని ఎద్దేవా చేశారు. జన్మభూమి కమిటీలు పెట్టి అర్హులైన వారికి కులం, మతం, పార్టీ చూసి బెనిఫిట్స్ ఇవ్వకుండా మోసం చేసినప్పుడు.. పవన్ నోరు ఎందుకు లెగలేదని ప్రశ్నించారు రోజా.. అప్పుడు నీ నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా? అని నిలదీశారు.. సచివాలయ వ్యవస్థ గురించి పవన్ కల్యాణ్‌కు తెలియదు.. అది చట్టం ద్వారా వచ్చింది.. పవన్ శాసనసభకు వచ్చి ఉంటే తెలిసి ఉండేది అని వ్యాఖ్యానించారు. కానీ, చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం మాత్రమే పవన్ కి వచ్చు.. ఆ మట్టి బుర్రకు పిచ్చి అరుపులు.. పిచ్చిగంతులు తప్ప ఏమీ తెలియదు అంటూ ఎద్దేవా చేశారు మంత్రి ఆర్కే రోజా.