మాంసాహార ప్రియులకు ఇదొక బ్యాడ్ న్యూస్. మీరు బాగా నాన్‌వెజ్ తింటుంటారా? అయితే మీరు ఎలాంటి మసాలాలు ఉపయోగిస్తుంటారు. ఇంట్లోనే తయారు చేసుకుంటారా? లేదంటే బయట మసాలాలు ఉపయోగిస్తారా? ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవండి.
ఇది కూడా చదవండి: Boora Narsaiah Goud: ప్రభుత్వం ఉంటదో ఉడుతుందో అనే భయం కాంగ్రెస్ వాళ్లకు పట్టుకుంది..
నాన్‌వెజ్ వంటకం చేస్తున్నారంటేనే మసాలాలు దండిగా దట్టిస్తుంటారు. సువాసనలతో గుమగుమలాడాలనుకుంటారు. ఒకప్పుడు ఇంట్లోనే మసాలాలు తయారు చేసుకునే వారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. రెడీమెడ్‌గా దొరికే మసాలాలనే ఉపయోగిస్తున్నారు. బజారులో దొరికే మసాలాలనే ఉపయోగిస్తుంటారు. అయితే ఇండియాలో తయారు అవుతున్న ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలో పురుగుల మందు అవశేషాలు ఉన్నట్లు సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ గుర్తించింది. మానవుల ప్రాణాలకు హాని కలుగుజేసే ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లుగా ఎస్‌ఎఫ్ఏ తేల్చింది. దీంతో ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలను తిరిగి ఇండియాకు పంపించాలని ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Anna Rambabu: వైసీపీ క్యాడరే నాకు బలం.. బలగం..
ఎవరెస్ట్ యొక్క ఫిష్ కర్రీ మసాలాలో అధిక మోతాదులో పురుగుల మందు అవశేసాలు ఉన్నట్లుగా గుర్తించినట్లుగా సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. భారత్ నుంచి దిగుమతి అవుతున్న మసాలాలను తిరిగి పంపించేయాలని ఆదేశించింది. హాంకాంగ్‌లోని సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ ఈ మేరకు రీకాల్ చేయాలని నోటిఫికేషన్ విడుదల చేసిందని ప్రకటనలో పేర్కొంది. మసాలాలో ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లు ఏజెన్సీ గుర్తించిందని వెల్లడించింది. ఆహారంలో పురుగుల మందు వాడేందుకు అనుమతి లేదని ఫుడ్ ఏజెన్సీ తెలిపింది. వ్యవసాయ ఉత్పత్తులను సూక్ష్మజీవులను నిరోధించడానికి రసాయనాలు ఉపయోగించవచ్చని తెలిపింది. ఇథిలీన్ ఆక్సైడ్ వినియోగం కారణంగా దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని స్పష్టం చేసింది. తక్కువ స్థాయిలో తీసుకుంటే మాత్రం తక్షణమే ప్రమాదం ఉండదని సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ వివరించింది.
ఇది కూడా చదవండి: Yuvan Shankar Raja: అంతా తూచ్ అంటూ స్వీట్ షాకిచ్చిన యువన్ శంకర్ రాజా
