NTV Telugu Site icon

Simran : 48 ఏళ్ల వయస్సులో జోరు చూపిస్తోన్న సిమ్రాన్

Simran

Simran

తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొరత నడుస్తున్న టైమ్ లో సడెన్‌గా వెండితెరపైకి వచ్చింది   సిమ్రాన్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి  తక్కువ టైంలోనే క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. టాప్ హీరోలతో జోడి కట్టి స్టార్ డమ్ తెచ్చుకుంది. ఏ సినిమాలో చూసినా ఈ అమ్మడే కనిపించేది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే మ్యారేజ్ చేసుకున్నప్పటికీ సినిమాలు కంటిన్యూ చేసింది. అయితే మునుపుటిలా క్యారెక్టర్స్ రాకపోవడంతో కాస్త గ్యాప్ తీసుకుని కంబ్యాక్ ఇచ్చింది ఈ ముంబయి భామ. 40 ప్లస్‌లో కూడా హీరోయిన్ క్యారెక్టర్స్ దక్కడం మామూలు విషయం కాదు.

Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఏవంటే..?

రజనీకాంత్, విక్రమ్, మాధవన్ లాంటి స్టార్ల సరసన జోడి కట్టింది. అటు బాలీవుడ్‌లోనూ సెకండ్ ఇన్నింగ్‌లో సత్తా చాటుతోంది. ఇదే కాదు అరణ్మణై4లో స్పెషల్ సాంగ్ , మరో వైపు సినిమాలే కాకుండా సీటాడెల్ లాంటి వెబ్ సిరీస్‌తోనూ తన ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉంది ఈ సీనియర్ భామ. యంగ్ హీరోయిన్లతో పోటీగా వర్క్ చేస్తోంది. ప్రజెంట్ సిమ్రాన్ చేతిలో మూడు, నాలుగు సినిమాలుంటే  అందులో హాఫ్ మూవీస్ హీరోయిన్ రోల్స్ చేస్తోంది. శబ్ధం, ద లాస్ట్ వన్ లాంటి హీరోయిన్ ఓరియెంట్ మూవీస్ చేస్తోంది. తమిళ స్టార్ హీరో శశి కుమార్‌తో టూరిస్ట్‌ ఫ్యామిలీ చేస్తోంది ఈ బ్యూటీ. రీసెంట్లీ ఈ మూవీ టైటిల్ టీజర్ రిలీజ్ చేసింది యూనిట్.  శ్రీలంకన్ తమిళ ఫ్యామిలీ దేశాన్ని విడిచి పెట్టి వెళ్లిపోవాలనుకున్న టైంలో జరిగే సంఘటనల ఆధారంగా మూవీ తెరకెక్కుతోంది. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ధ్రువ నక్షత్రం, వనంగముడి కూడా రిలీజ్ కావాల్సి ఉన్నాయి. ప్రజెంట్ ఆమె ఏజ్ 48. కానీ యంగ్ హీరోలతో పోటీగా సినిమాలు చేస్తోంది.