Electric Scooter: ఒక్కసారి చార్జ్ చేస్తే 400 కి.మీ వెళ్లొచ్చు.. ఆఫీస్‌కు వెళ్లేవారికి బెస్ట్ ఇ-స్కూటర్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లో అత్యధిక రేంజ్ ఇస్తామని చెబుతూ సింపుల్ ఎనర్జీ సంస్థ ‘సింపుల్ అల్ట్రా’ పేరుతో ఒక ప్రీమియం ఈ-స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఏకంగా 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ వెల్లడించింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.2.49 లక్షలుగా ఉంది.
ఈ స్కూటర్లో మొత్తం 6.5 kWh కెపాసిటీ కలిగిన లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇందులో 5 kWh మెయిన్ బ్యాటరీతో పాటు 1.5 kWh సెకండరీ బ్యాటరీ ఉంటాయి. దీనిని ఫాస్ట్ ఛార్జర్ ద్వారా సుమారు 2 గంటల 15 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. అదే సాధారణ పోర్టబుల్ ఛార్జర్ అయితే పూర్తిగా నిండడానికి దాదాపు 8 గంటల 30 నిమిషాలు పడుతుంది.
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
ఇందులోని శక్తివంతమైన PMSM మోటార్ 8.8 kW పీక్ పవర్‌ను, 72 Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 115 కిలోమీటర్లు కాగా, కేవలం 2.77 సెకన్లలోనే 0 నుంచి 40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. మెరుగైన ప్రయాణ అనుభూతి కోసం ఇందులో ఎకో, రైడ్, సోనిక్ వంటి ఆరు రైడింగ్ మోడ్లతో పాటు నాలుగు ట్రాక్షన్ కంట్రోల్ మోడ్‌లను అందించారు.
సేఫ్టీ, టెక్నాలజీ పరంగా ఈ స్కూటర్లో అనేక ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. 7 అంగుళాల TFT టచ్‌స్క్రీన్ డ్యాష్‌బోర్డ్, ఆండ్రాయిడ్ 12 ఆధారిత సింపుల్ OS, మ్యాప్‌మైఇండియా నావిగేషన్, హిల్ హోల్డ్ అసిస్ట్, రిజెనరేటివ్ బ్రేకింగ్, డ్రాప్ సేఫ్ టెక్నాలజీ వంటివి ఇందులో ఉన్నాయి. అలాగే యాంటీ-థెఫ్ట్ అలర్ట్స్, జియోఫెన్సింగ్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
వారంటీ విషయానికి వస్తే.. వాహనానికి 3 సంవత్సరాలు లేదా 30,000 కి.మీ, అలాగే బ్యాటరీ, మోటార్‌కు ‘సూపర్ ప్రొటెక్ట్’ ప్లాన్ కింద 8 సంవత్సరాలు లేదా 80,000 కి.మీ వారంటీ ఇస్తున్నారు. రోజువారీ ప్రయాణాలతో పాటు సుదూర ప్రయాణాలు చేసే వారికి ఈ లాంగ్-రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది.
తాజావార్తలు
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!