Site icon NTV Telugu

Hardik Pandya: తనకు హార్దిక్‌ పాండ్యాపై అనుమానం ఉందంటున్న మాజీ ఆటగాడు..!

13

13

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్ జట్టు ఫర్ఫార్మెన్స్ పేలవంగా ఉంది. ఈ సీజన్ లో ఆడిన మొదటి మూడు మ్యాచ్ లలో ఓడిపగా తాజాగా రెండు మ్యాచ్లను గెలిచింది. దాంతో ఇప్పుడు మళ్ళీ విజయాల బాట పట్టింది. ఇకపోతే., ముంబై ఇండియన్స్ జట్టుకు సంబంధించి ఐపీఎల్ మొదలు కాకముందే అనేక వార్తలు మీడియాలో ఎక్కువగా వచ్చాయి. దీనికి కారణం రోహిత్ శర్మ, హార్థిక్ పాండ్య. ముంబై ఇండియన్స్ కు 5 ఐపీఎల్ ట్రోఫీలను అందించిన రోహిత్ శర్మ కాకుండా కొత్తగా హార్దిక్ పాండ్యాను ముంబై టీంకి కెప్టెన్ గా తీసుకురావడంతో పెద్ద ఎత్తున అభిమానుల నుంచి విమర్శలు వచ్చాయి.

Also Read: Supreme Court: కేజ్రీవాల్‌ బెయిల్ పిటిషన్ స్వీకరణ.. విచారణ ఎప్పుడంటే..!

ఇకపోతే తాజాగా హార్దిక్ పాండ్యా పై తనకు అనుమానం ఉందంటూ.. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్‌ సైమన్‌ డౌల్‌ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. తన అనుభవంతో చెబుతున్నానని.. హార్దిక్ ఏదో ఇబ్బందితో బాధపడుతున్నాడని.. కాకపోతే., ఆ విషయాన్ని మాత్రం తను బయట పెట్టట్లేదని అతడు అభిప్రాయపడ్డాడు. ఇక ఆ విషయాన్ని గురించి హార్దిక్ ఏదో దాచి పెడుతున్నట్లు కనిపిస్తుందని ఆయన పేర్కొన్నాడు.

Also Read: Rahul Gandhi: సీఎం స్టాలిన్‌కు రాహుల్ గిఫ్ట్.. ఏమిచ్చారంటే..!

ఇందులో భాగంగానే అతను మాట్లాడుతూ.. ముంబై ఆడిన మొదటి మ్యాచ్ లో మొదటి ఓవర్ వేసిన బౌలర్ అకస్మాత్తుగా జట్టుకు తన సేవలు అవసరం లేనట్లుగా వ్యవహరించడం చాలా ఆశ్చర్యంగా ఉందంటూ పేర్కొన్నాడు. హార్దిక్ ఏదో గాయపడ్డాడు.. అయితే ఆ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు మాత్రం బయటికి చెప్పట్లేదు. కచ్చితంగా ఏదో విషయాన్ని అతడు దాచిపెడుతున్నాడని.. నా మనసు బలంగా చెబుతూ ఉందంటూ సైమన్‌ డౌల్‌ ఓ షోలో వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు పెద్దఎత్తున్న దుమారం రేపుతున్నాయి.

Exit mobile version