Silk Smitha: సిల్క్ స్మిత.. ఈ పేరు తెలియని వారు 80వ దశకంలో ఎవరూ ఉండరు. అప్పుడనే కాదు ఇప్పటికి కూడా ఈ పేరు చాలా ఫేమస్. ఈ మధ్య హీరో నాని నటించిన దసరా సినిమాలో కూడా సిల్క్ బార్ అంటూ సిల్క్ స్మితను హైలెట్ చేశారు. అలా వుంటుంది మరీ సిల్క్ స్మిత క్రేజ్. తన అందచందాలతో, మత్తు కళ్లతో అప్పట్లో చిత్రపరిశ్రమను ఓ ఊపు ఊపింది ఈ భామ. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఫాదర్స్ అందరితో విజిల్ వేయించే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అప్పట్లో ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాళ్లు లేరు. అయితే అంత క్రేజ్ సంపాదించుకున్న సిల్క్ స్మిత జీవితంలో మాత్రం చాలా కష్టాలు పడింది. సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని కొవ్వలి గ్రామంలో జన్మించింది. సినిమాల్లో నటించాలని చిన్నప్పటి నుంచే సిల్క్ స్మితకు చాలా కోరికగా ఉండేదట. అయితే చిన్న వయసులోనే ఆమెకు తన తల్లిదండ్రులు పెళ్లి చేసేశారట. అయితే అత్తింట్లో కూడా సిల్క్ స్మిత చాలా కష్టాలు పడిందట. అందుకే అత్తింటిని వదిలేసి తన పిన్ని ఇంటికి వచ్చేసిందట సిల్క్ స్మిత.
Also Read: Naveen Krishna: పవిత్ర లోకేశ్ అలాంటి వ్యక్తి.. నరేష్ కొడుకు సంచలన వ్యాఖ్యలు
అయితే వాళ్ల పిన్ని సినిమాలో నటించాలన్న స్మిత కోరికను అర్థం చేసుకొని తనతో పాటు మద్రాసుకు తీసుకువెళ్లిందంట. అయితే అక్కడ బతకడం కోసం చాలా కష్టాలు పడిందంట. కొందరి ఇళ్లల్లో పనిమనిషిగా కూడా పనిచేసిందంట. ఆ సయమంలోనే స్టార్ హీరోయిన్ అపర్ణ ఇంట్లో కూడా పని మనిషిగాచేసిందట. ఆ సమయంలోనే ఓ దర్శకుడి కంట పడటంతో సినిమాల్లో అవకాశాలను పొందించి. చిన్నప్పటి నుంచి సిల్క్ స్మితకు డ్యాన్స్ అంటే పిచ్చి ఉండేదట. ఎప్పటికైనా పెద్ద డ్యాన్సర్ అవ్వాలనుకునేదంటా. ఆ డ్యాన్సే ఆమెకు సినిమాల్లో ఎదిగేందుకు ఉపయోగపడింది. మొదట్లో సైడ్ డ్యా్న్సర్ గా చేసిన సిల్క్ తరువాత ఐటెం సాంగ్స్ చేయడం మొదలు పెట్టింది. తరువాత ఐటెం సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఇక సిల్క్ స్మిత దర్శకరత్న దాసరి నారాయణరావు తెరకెక్కించిన ఒక్క మగాడు ఒక ఆడది సినిమా ద్వారా తొలిసారి వెండితెరకు పరిచయం అయింది. తరువాత హీరోయిన్ గా ఎక్కువ అవకాశాలు రాక ఐటమ్ సాంగ్స్ చేయడం మొదలు పెట్టింది. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా ఐటెంసాంగ్స్ క్వీన్ గా మారిపోయింది. అయితే కొంత మంది మోసం చేయడం వల్ల బాగా కుంగిపోయిన సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకొని మరణించింది.
