NTV Telugu Site icon

Silk Smita: మేకప్ ఆర్టిస్ట్ కాస్త హీరోయిన్ అయి.. జీవితాంతం ప్రేమకోసం పరితపించిపోయింది

Silk Smitha

Silk Smitha

Silk Smita: సిల్క్ స్మిత ఈ పేరంటే తెలియని వారుండరు. తన అందచందాలతో ఓ తరం కుర్రకారును ఉర్రూతలూగించిన హీరోయిన్ కమ్ డ్యాన్సర్. ఆమె ప్రపంచాన్ని వీడి ఇన్నాళ్లైన ప్రేక్షకుల నోళ్లలో తన పేరు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఆమె తన కెరీర్‌ను చాలా కింది నుంచి ప్రారంభించి.. తన కీర్తిని ఆకాశం అంత ఎత్తుకు తన నటన, అందంతో తీసుకెళ్లింది. ఆమె కథలు ఇప్పటికీ ప్రజల నోళ్లలో ఉన్నాయి. 1960 డిసెంబర్ 2వ తేదీన చెన్నైలోని తెలుగు కుటుంబంలో జన్మించారు సిల్క్ స్మిత. 23 సెప్టెంబర్ 1996 న తన 36ఏళ్ల వయసులో ప్రపంచానికి వీడ్కోలు చెప్పారు. తన వర్ధంతి స్పెషల్‌లో సిల్క్ స్మిత జీవితంలోని కొన్ని కథల గురించి తెలుసుకుందాం.

10 ఏళ్లకే చదువుకు స్వస్తి
సిల్క్ స్మిత బాల్యం కష్టాల్లోనే గడిచింది. తను కడు పేదరిక కుటుంబంలో జన్మించింది. ఆమె ఇంటి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. దాని కారణంగా తాను కేవలం 10 సంవత్సరాల వయస్సులో చదువును వదిలివేయవలసి వచ్చింది. కొంతకాలం తర్వాత సిల్క్ స్మిత పెళ్లి చేసుకుంది. అక్కడా తనకు సుఖం లేకుండా పోయింది. అలాంటి పరిస్థితుల్లో ఆమె అత్తమామల ఇంటిని వదిలి చెన్నైకి వచ్చింది.

Read Also:Chinta Mohan: చంద్రబాబు 49 ఏళ్లుగా నాకు తెలుసు.. చాలా భయస్తుడు..!

మేకప్ చేస్తూనే హీరోయిన్‌గా
చెన్నై వచ్చిన తర్వాత సిల్క్ స్మిత సినీ పరిశ్రమలోని నటీమణులకు మేకప్ వేయడం ప్రారంభించింది. మెల్లమెల్లగా ఆమె మదిలో నటి కావాలనే ఆకాంక్ష కూడా పెరగడం మొదలైంది. సిల్క్ చలనచిత్ర జీవితం తమిళ చిత్రం వండిచక్రంతో ప్రారంభమైంది. ఇందులో ఆమె చాలా చిన్న పాత్రను పోషించింది. సిల్క్ స్మిత తన 17 ఏళ్ల కెరీర్‌లో 450కి పైగా సినిమాల్లో నటించింది. చాలా చిత్రాలలో, ఆమె ఐటెం సాంగ్స్ చేసేది. ప్రత్యేకంగా వాటిని చూడటానికే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టేవారు.

సిల్క్ జీవితంపై సినిమా
సిల్క్ స్మిత జీవితంలో పేరు, డబ్బు, కీర్తి అన్నీ పొందింది. కానీ జీవితాంతం తాను నిజమైన ప్రేమ కోసం పరితపించింది. ఇండస్ట్రీలో పనిచేస్తున్నప్పుడు సిల్క్‌కి చాలామందిలో వ్యవహారాలు ఉండేవని పుకార్లు వినిపించాయి. అందులో సౌత్ సూపర్‌స్టార్ రజనీకాంత్ పేరు కూడా వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై అధికారిక సమాచారం ఎప్పుడూ వెల్లడి కాలేదు. ఒంటరితనం కారణంగానే సిల్క్ స్మిత మద్యానికి బానిసైంది. క్రమంగా తాగుబోతుగా మారి మృత్యువును కౌగిలించుకుంది. 23 సెప్టెంబర్ 1996న ఆమె తన ఇంట్లోనే శవమై కనిపించింది. సిల్క్ స్మిత జీవితంపై డర్జీ పిక్చర్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ నటించింది.

Read Also:TS Group-1 Exam: బిగ్ బ్రేకింగ్.. తెలంగాణ గ్రూప్-1 పరీక్ష మళ్లీ రద్దు..

Show comments