Sikhs for Justice: కెనడా విడిచి వెళ్లిపోవాలంటూ హిందువులకు అల్టిమేటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sikhs For Justice Warns Hindus of Indian Origin to Leave Canada: కెనడా ప్రభుత్వం, భారత్ ల మధ్య ప్రస్తుతం ఖలిస్తానీ చిచ్చు రగులుతున్న విషయం తెలిసిందే. జీ20 సమావేశాలకు హాజరైన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో ఈ విషయం గురించి చర్చించిన కొద్ది రోజులకే ఈ రగడ మరింతగా ముదిరిపోయింది. కెనడా ప్రధాని ఖలిస్తానీ ఉగ్రవాదిని చంపిన కేసులో భారతీయ ఏజెంట్లకు సంబంధం ఉందని తమ ప్రభుత్వం వద్ద నమ్మదగిన సాక్ష్యాలు ఉన్నాయని ప్రకటించినప్పటి నుంచి ఈ వివాదం మరింత రాజుకుంటుంది. అయితే ఈ వ్యాఖ్యలను ఇప్పటికే భారత్ ఖండించింది. ఈ చర్యల్లో భాగంగా భారతదౌత్య వేత్తను కెనడా బహిష్కరించగా, ఆ దేశ అధికారిని కూడా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ భారత్ హుకుం జారీ చేసింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఇక కెనడాలో ఉన్న ఖలిస్తానీ మద్దతుదారులు కూడా రెచ్చిపోతున్నారు.
Also Read: Software Jobs: ఇంజనీర్స్ అలెర్ట్.. ఇకమీదట ఆ కంపెనీల్లో ఉద్యోగాలు రావడం కష్టమే..
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
తాజాగా కెనడాలోని హిందువులను భారత్ కు తిరిగి వెళ్లిపోవాలంటూ ఖలిస్థాన్ అనుకూల వాద సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ జే) అల్టిమేటం జారీ చేసింది. ఈ విధంగా తెలియజేస్తూ ఎస్ఎఫ్ జే లీగల్ కౌన్సిల్ గుర్ పట్వంత్ పన్నమ్ ఓ వీడియో మెస్సేజ్ విడుదల చేశారు. ఇందులో ఖలిస్థాన్ నేత హర్ దీప్ సింగ్ నిజ్జర్ హత్యను సెలబ్రేట్ చేసుకున్నందుకు, ఈ విషయంలో భారత్ కు కెనడాలో ఉన్న హిందువులందరూ మద్దతుగా నిలిచారని గుర్ పట్వంత్ పేర్కొన్నాడు. కెనడాలో ఉన్న ఇండో-హిందూ వెంటనే దేశాన్ని వీడాలని హుకుం జారీ చేశాడు. కెనడాలో ఉన్న హిందువులంతా భారత్ కు మద్దతు నిలవడమే కాకుండా ఖలిస్థాన్ అనుకూల సిక్కుల భావ ప్రకటన వ్యక్తీకరణ అణచివేతకు సైతం మద్దతు తెలుపుతున్నారంటూ మండిపడ్డాడు. దేశాన్ని విడిచి వెళ్లాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని హెచ్చరించాడు. పట్వంత్ విడుదల చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ హెచ్చరికపై కెనడియన్ హిందూస్ ఫర్ హార్మనీ సంస్థ అధికార ప్రతినిధి విజయ్ జైన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు హిందూఫోబియాను కెనడా అంతటా పెద్ద ఎత్తున అలుముకున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికే పట్వంత్ ను భారత్ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇప్పటికే ఖలిస్థానీలను ప్రోత్సహిస్తున్న కెనడా హిందువుల భద్రతకు ఎలాంటి చర్యలు చేపడతుందో చూడాలి.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!