Site icon NTV Telugu

SIIMA2023 : ఉత్తమ నటిగా అవార్డు పొందిన శ్రీలీల..

Whatsapp Image 2023 09 16 At 9.57.01 Am

Whatsapp Image 2023 09 16 At 9.57.01 Am

ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరిగే సైమా అవార్డ్స్ వేడుక ఈ సారి దుబాయ్ వేదికగా ఎంతో గ్రాండ్ గా ప్రారంభం అయింది. సౌత్ నుంచి పలువురు సినీ సెలెబ్రేటీస్ ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, రానా, శ్రీలీల, శృతి హాసన్, మీనాక్షి చౌదరి లాంటి టాప్ సెలెబ్రేటీస్ సైమా ఈవెంట్ లో పాల్గొని ఎంతగానో సందడి చేశారు. ప్రతిష్టాత్మకంగా సాగే ఈ అవార్డ్స్ వేడుకలో చాలా మంది స్టార్ హీరోలు మరియు హీరోయిన్లు అవార్డులను గెలుచుకున్నారు. ఉత్తమ నటుడు ఎవరు, నటి ఎవరు, ఉత్తమ దర్శకుడు ఎవరు.. ఇలా పలు విభాగాల్లో విజేతలు ఎవరో తెలుసుకునేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు.అయితే ఉత్తమ నటుడు అవార్డు ఎవరికి దక్కబోతోంది అనే విషయం పై అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు..ఉత్తమ నటుడి విభాగంలో అడివి శేష్- మేజర్, దుల్కర్ సల్మాన్ – సీతారామన్, నిఖిల్ – కార్తికేయ2 , సిద్ధూ జొన్నలగడ్డ – డీజే టిల్లు చిత్రాల నుంచి పోటీ పడగా ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్, రాంచరణ్ కూడా పోటీలో నిలిచారు.అయితే తుది విజేతగా గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నిలవడం జరిగింది.దీనితో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా సైమా అవార్డ్స్ 2023 లో విజేతగా నిలిచాడు. ఎన్టీఆర్ అభిమానులంతా సోషల్ మీడియాలో ఈ విషయాన్నీ ఎంతో వైరల్ చేస్తున్నారు. దాదాపు ఏడేళ్ల తరువాత ఎన్టీఆర్ ఈ అవార్డు అందుకున్నారు.

అలాగే ఉత్తమ నటిగా యంగ్ బ్యూటీ శ్రీలీల ఈ అవార్డు ను కైవసం చేసుకున్నారు.రవితేజ నటించిన ధమాకా చిత్రంలో హీరోయిన్ గా తన అద్భుతమైన పెర్ఫార్మన్స్ కు ఆమె ఈ అవార్డు దక్కించుకుంది. అదేవిధంగా సైమా అవార్డ్స్ 2023లో అవార్డ్స్ అందుకున్న విజేతల వివరాలు ఇలా వున్నాయి.సీతారామం సినిమాకు ఉత్తమ చిత్రం గా అవార్డు దక్కింది. అలాగే దర్శక ధీరుడు రాజమౌళి కి ఆర్ఆర్ఆర్ చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా అవార్డు వచ్చింది. అలాగే స్టార్ హీరో రానా కు భీమ్లా నాయక్ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటుడుగా అవార్డు లభించింది. అలాగే రీసెంట్ గా ఆస్కార్ అవార్డ్స్ అందుకున్న కీరవాణి, చంద్రబోస్ ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గీత రచయిత గా ఆర్ఆర్ ఆర్ చిత్రానికి గాను అవార్డ్స్ అందుకున్నారు.ఉత్తమ సినిమాటోగ్రఫీ కేటగిరి లో సెంథిల్ కుమార్ (RRR)అవార్డు అందుకున్నారు. అలాగేఉత్తమ పరిచయ నటి గా మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాకు గాను అవార్డు అందుకుంది. అలాగే ఉత్తమ విలన్ గా సుహాస్ హిట్ 2 చిత్రానికి గాను అవార్డ్ అందుకున్నారు

Exit mobile version