Site icon NTV Telugu

Sigachi Company: బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం.. వైద్య ఖర్చులన్నీ మేమే చెల్లిస్తాం..!

Sigachi Company

Sigachi Company

Sigachi Company: సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదం పలు కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలో సిగాచి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ అమృత్ రాజ్ సింహ స్పందించారు. ఈ ఘటనపై కంపెనీ మేనేజ్మెంట్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోందని ఆయన తెలిపారు. ఈ ప్రమాదంలో 38 మంది కార్మికులు మృతి చెందగా, 33 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 90 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. గాయపడినవారికి పూర్తి వైద్య సదుపాయాలను అందిస్తున్నామని, వారి వైద్య ఖర్చులన్నీ కంపెనీ భరిస్తుందని స్పష్టం చేశారు.

Read Also:Honor Magic V5: ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6100mAh బ్యాటరీతో హానర్ మ్యాజిక్ V5 లాంచ్..!

మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. కోటి పరిహారంగా ఇవ్వడం కాకుండా, అన్ని రకాల బీమా క్లెయిమ్‌లను కూడా సత్వరమే చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. హాస్పిటల్‌ లో చికిత్స పొందుతున్న బాధితుల వద్ద కంపెనీ ప్రతినిధులు ప్రత్యక్షంగా హాజరై అన్ని అవసరాలను చూసుకుంటున్నారని వివరించారు. ప్రమాదానికి సంబంధించి డ్రైయింగ్ యూనిట్, ఎయిర్ హ్యాండ్లింగ్ కండిషనింగ్ యూనిట్లు సక్రమంగా పనిచేస్తున్నాయని, పరికరాలన్నీ కొత్తవే అయినా భవనం పాతదేనని ఆయన పేర్కొన్నారు. ఫైర్ సేఫ్టీ నామినల్స్ అన్నీ సక్రమంగా అమలు చేసినట్టు ఆయన తెలిపారు.

Read Also:Workplace Harassment: టాయిలెట్‌లో మహిళా ఉద్యోగిని వీడియో తీసిన ఇన్ఫోసిస్ ఉద్యోగి..

ప్రమాదానికి రియాక్టర్ పేలుడే కారణం కాదని అనుమానం వ్యక్తం చేసిన ఆయన, తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వ దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాతే తెలుస్తుందని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న విచారణకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటన అనంతరం మూడు నెలల పాటు పరిశ్రమ కార్యకలాపాలపై నిర్ణయం తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, వారిని ఒక్కరిని కూడా నిర్లక్ష్యం చేయబోమని నొక్కిచెప్పారు.

Exit mobile version