Site icon NTV Telugu

Seediri Appalaraju : పెన్షన్లను తగ్గించిన ఘనత బాబుదే.. సీదిరి అప్పలరాజు కామెంట్స్..

Sidiri Appalaraju

Sidiri Appalaraju

Seediri Appalaraju : వైసీపీ ఇచ్చిన పెన్షన్ల కంటే కూటమి ప్రభుత్వం తక్కువ ఇస్తోందని.. ఈ ఘనత చంద్రబాబుదే అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలం అయ్యారంటూ దుయ్యబట్టారు. 50 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ ఇస్తా అన్న చంద్రబాబు.. ఇప్పుడు అతిగతి లేకుండా వదిలేశారంటూ మండిపడ్డారు. ఇంటింటికి పెన్షన్స్ ఇచ్చే విధానం పోయిందని.. వృద్దులు, వికలాంగులు ఎండలలో ఉంటూ ఇబ్బడి పడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన పెట్టుబడిదారులు భయపెడుతున్నారని తెలిపారు.

Read Also : Kannappa : కన్నప్ప సినిమాను అడ్డుకుంటాం.. బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం

దావోస్ కు వెళ్లిన చంద్రబాబు, లోకేష్ ఖాళీ చేతులతో వచ్చారు. ఏమైనా ప్రశ్నిస్తే రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఉచిత సిలెండర్ అన్నారు.. ఫ్రీ బస్ అన్నారు. అన్ని హామీల్లోనూ వెన్నుపోటు పొడిచారు. నిరుద్యోగులకు భృతి, అమ్మకు వందనం, రైతులకు పీఎం కిసాన్ కిసాన్ ఇవ్వకుండా మోసం చేశారు. ఇంత చేతకాని ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. ఇచ్చిన హామీలను మొదటి సంవత్సరంలో ఇచ్చిన ఘనత వైసీపీది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదట స్థానం తెచ్చింది సీఎం జగన్. రాష్ట్రంలో 22 శాతం జిడిపి రేట్ తగ్గిపోయింది. కూటమి వచ్చిన మొదటి ఏడాదిలోనే లక్షా యాబై వేళ కోట్ల అప్పులు చేశారు. ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు’ అంటూ మండిపడ్డారు.

Read Also : Anagani Satyaprasad : అమరావతి మహిళలను కించపరచడం దుర్మార్గం.. అనగాని సత్యప్రసాద్ ఫైర్

Exit mobile version