Site icon NTV Telugu

Bollywood : పదేళ్లుగా బ్లాక్ బస్టర్ చూడని యంగ్ హీరో.. పిలిచి అవకాశాలిస్తున్న బడా సంస్థ

Siddardh Malhotra

Siddardh Malhotra

బాలీవుడ్ స్టార్ హీరో సిద్దార్థ్‌ మల్హోత్రా ఇతర నిర్మాణ సంస్థలతో వర్క్ చేసినా.. ధర్మ ప్రొడక్షన్స్‌‌తో అతడి బాండింగ్ డిఫరెంట్. తనను స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌తో హీరోగా మార్చిన కరణ్ జోహార్‌ను మెంటర్‌గా ఫీలవుతుంటాడు. కరణ్ కూడా వీలు కుదిరినప్పుడల్లా సిద్‌తో సినిమాలు చేసి అతడ్ని తమ ఆస్థాన హీరోగా మార్చేశాడు. ఇప్పటి వరకు సిద్ 15-16 సినిమాలు చేస్తే.. అందులో సిక్స్ మూవీస్ ధర్మ ప్రొడక్షన్‌లో చేసినవే.

Also Read : VenkateshXTrivikram : ‘ఆదర్శకుటుంబం’ (House No: 47) రిలీజ్ డేట్ ఫిక్స్

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌‌తో మొదలైన వీరి జర్నీ.. 2024లో వచ్చిన యోధ వరకు కొనసాగుతూనే ఉంది. కరణ్ అండ్ సిద్ కాంబోలో వచ్చిన కపూర్ అండ్ సన్స్ హీరో ఖాతాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ చూడలేదు సిద్దార్థ్‌ మల్హోత్రా. షేర్సా ఓటీటీలో మంచి అప్లాజ్ తెచ్చుకోగా.. యోధ ఫ్లాప్ అయ్యింది. అయినా కూడా ఈ హిట్ కాంబో మరోసారి కొలబరేషన్‌కు సిద్ధమౌతుంది. పరమ్ సుందరితో మడాక్ ఫిల్మ్ యూనివర్శిటీలో చేరిన సిద్దార్థ్‌.. మళ్లీ లైఫ్ ఇచ్చిన ధర్మ ప్రొడక్షన్‌లోకి వచ్చేస్తున్నాడు. గుంజన్ సక్సేనా, మిస్ అండ్ మిస్టర్ మహీ చిత్రాలతో ఫ్రూవ్ చేసుకున్న శరణ్ శర్మకు మరోసారి డైరెక్షన్ బాధ్యతలు అప్పగించబోతున్నాడట కరణ్. సమ్మర్ నుండి ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు సమాచారం. కాగా, సిద్దార్థ్‌ ప్రస్తుతం వివాన్ మూవీతో బిజీగా ఉన్నాడు. అలాగే రాజ్ కుమార్ సంతోషీ మూవీకి కమిటయ్యాడని తెలుస్తోంది. మరి కపూర్ అండ్ సన్స్ రేంజ్ హిట్ చూడని సిద్‌ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడేది ఎప్పుడో..?

Exit mobile version