Side Effects Of Cumin: మనం రోజూ వారి తాలింపులోనూ, మసాలాల్లోనూ జీలకర్రను వినియోగిస్తూ ఉంటాం. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నారు. అజీర్తి సమస్యలకు ఇది చక్కటి జౌషధంలా పనిచేస్తుంది. అందుకే ఫుల్ గా తింటే వెంటనే కొంచెం . జీలకర్ర నోటిలో వేసుకుంటాం. దాని వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. కేవలం సువాసన కోసమే కాకుండా దీని వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడమే కాకుండా జలుబు, దగ్గు వంటి సాధారణ సమస్యలకు జీలకర్ర మంచిగా ఉపయోగపడుతుంది.
Also Read: Tractor: ట్రాక్టర్ కొనాలనుకుంటున్నారా.. సరైనది ఎంచుకోవడంలో ఈ విషయాలను గుర్తుంచుకోండి
చెడు బాక్టీరియాతో పోరాడుతుంది. చర్మ సంబంధిత సమస్యలను నయం చేస్తుంది. వాంతులు, వికారం వంటి సమస్యలకు చెక్ పెట్టే జీలకర్ర గర్భాశయ, గుండె సంబంధిత వ్యాధుల ముప్పును కూడా తగ్గిస్తుంది. బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లామేటరి గుణాలు ఉండటం వల్ల కడుపులో మంటను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని జీల కర్ర పెంచుతుంది. ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. ఇక జీలకర్ర నీటిలో తేనె కలుపుకొని తాగితే బరువు తగ్గుతారు. నాడీ వ్యవస్థ చురుగ్గా పనిచేయడంలో కూడా జీలకర్ర చక్కగా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. పార్కిన్‌సన్ వ్యాధిని నివారించడంలో కూడా జీలకర్ర తోడ్పడుతుంది. అయితే ఎంత మంచి చేసేదైనా అతిగా తీసుకుంటే ప్రమాదమే అనే విషయం అందరూ గుర్తుంచుకోవాలి. మోతాదు ఎక్కువ అయితే ఏదైనా మంచికి బదులు చెడు చేస్తోంది. అలాగే జీలకర్రను ఎక్కువ తీసుకున్నా కూడా చెడే జరుగుతుంది. రోజుకు 300 నుంచి 600 మిల్లి గ్రాములు మాత్రమే జీలకర్రను తీసుకోవాలి. అయితే దీనికి మించి జీలకర్రను తీసుకుంటే టెస్టోస్టిరాన్ స్థాయి తగ్గుతుందని, ఫలితంగా పురుషుల్లో సంతాన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.