NTV Telugu Site icon

Tillu Square Collections : దుమ్ముదులిపేస్తున్న ‘టిల్లు స్క్వేర్’ మూవీ.. 5 రోజులకు ఎన్ని కోట్లంటే?

Tillu2

Tillu2

డీజే టిల్లు సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది.. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.. ఆ సినిమాతో సిద్దు జొన్నలగడ్డ ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు.. బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.. ఇక తాజాగా ఆ సినిమాకు సీక్వెల్ గా ‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది..ఈ సినిమా మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది.. మరోవైపు భారీగా కలెక్షన్స్ ను కూడా అందుకుంటుంది.. ఐదు రోజులకు సినిమా ఎంత వసూల్ చేసిందో ఒకసారి చూద్దాం..

జొన్నలగడ్డ సిద్దు, అనుపమ పరమేశ్వరన్ హీరో,హీరోయిన్గా నటించారు.. ఈ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నేహా శెట్టి, ప్రిన్స్, మురళిధర్ ప్రత్యేక పాత్రల్లో నటించారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల, థమన్ సంగీతాన్ని అందించారు.. ఈ సినిమాకు ప్రీ బిజినెస్ కూడా భారీగానే జరిగిన విషయం తెలిసిందే.. ఇక మొత్తం కలెక్షన్స్ ను ఒకసారి చూద్దాం..

5రోజుల్లో టిల్లు స్క్వేర్ మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి ఈ చిత్రం రూ. 2.80 కోట్లు షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ. 3.50 కోట్లు రాబట్టింది. ఇలా ఐదు రోజుల్లోనే ‘టిల్లు స్క్వేర్’ మూవీ రూ. 43.50 కోట్లు వరకూ షేర్ వసూలు చేసి సత్తా చాటుకుంది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రూ.85 కోట్లు గ్రాస్ వచ్చింది.. ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది..

Show comments