Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddipet District: సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని రాంసాగర్ గ్రామంలో దారుణ ఘటన వెలుగుచూసింది. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో ఓ యువకుడిపై జరిగిన దాడి అతని ప్రాణాలు తీసింది. గ్రామానికి చెందిన శ్యామ్ చారి అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం మహిళ భర్తకు తెలిసి కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. ఆ మహిళ భర్త విడాకులు తీసుకున్నాడు. అనంతరం మహిళ కుటుంబ సభ్యులు శ్యామ్‌పై కక్ష పెంచుకున్నారు. ఈ నెల 26న జరిగిన ఘటనలో శ్యామ్ చారిని పట్టుకుని అతని కాళ్లు, చేతులు కట్టేసి కర్రలు, డ్రిప్ పైపులతో విచక్షణారహితంగా కొట్టారు. ఈ దాడిలో అతని తలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్యామ్ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా బయటకు రావడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీడియోలో యువకుడిపై దాడి చేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు 20 మందిపై కేసు నమోదు చేసి పలువురిని అరెస్ట్ చేశారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, వ్యక్తిగత విభేదాలు హింసాత్మక రూపం దాల్చి ఓ యువకుడి ప్రాణాలు బలితీసుకోవడం విషాదకరంగా మారింది.
Also Read
- CJP: ‘‘శివాజీ పార్క్‌లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
- Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
- Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
- AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
తాజావార్తలు
-
Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
-
CJP: ‘‘శివాజీ పార్క్‌లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
-
Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
-
OTR: కొత్తగూడెం బీఆర్ఎస్లో సరికొత్త సమీకరణాలు..
-
Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!