NTV Telugu Site icon

Minister Harish Rao: సిద్దిపేటలో రైలు కూత.. మంత్రి హరీశ్ రావు సెల్ఫీ

Harish Rao

Harish Rao

సిద్ధిపేట జిల్లా ప్రజలకు రైలు ఎక్కాలనే కల ఎట్టకేలకు తీరబోతోంది. త్వరలోనే సిద్దిపేటకి రైలు జర్నీ ఆరంభం కానున్నాయి. ఈ క్రమంలో నర్సాపూర్ స్టేషన్ వరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ట్రయల్ రన్ నిర్వచించారు. ఇక, సిద్దిపేటలో రైలు కూతపై మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. ట్రైన్ ముందు నిలబడి సెల్ఫీ దిగి తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారాయన. అయితే, ఈ ట్రైన్ ఎప్పటి నుంచి నడుస్తుంది అనే దానిపై స్పష్టత రావాల్సి ఉండగా.. అది అతి త్వరలోనే అని తాజా ఫొటోతో మంత్రి హరీశ్ రావు సంకేతాలు ఇచ్చారు.

Read Also: Gun Fire: బీహార్లో కాల్పుల కలకలం.. కోర్టు ప్రాంగణంలో ఇద్దరు ఖైదీల కాల్చివేత

సిద్దిపేట నుంచి సరిపడా సంఖ్యలో ప్రయాణికులు ఉంటారని రైల్వే అధికారులు నిర్ధారించుకున్నారు.. రోజుకు ఒకటి లేదా రెండు పుష్ పుల్ రైలు ట్రిప్పులు నడపాలని ఈ మేరకు నిర్ణయించారు. సిద్దిపేట నుంచి కాచిగూడకు ఆ రైలు నడుస్తుందని వారు తెలిపారు. ఇక తిరుపతి, బెంగళూరుకు గానీ ముంబయికి గానీ ఎక్స్ ప్రెస్ రైళ్లను కూడా సిద్దిపేట నుంచి నడిపించేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు భావిస్తోన్నారు. హైదరాబాద్ నుంచి ప్రారంభం అవుతున్న కొన్ని ఎక్స్ ప్రెస్ లను సిద్దిపేట నుంచి ప్రారంభిస్తే కరీంనగర్ ప్రయాణికులకు కూడా ఉపయోగపడుతుందని రైల్వే అధికారులు అనుకుంటున్నారు.

Read Also: Pakistan Crisis: పాక్‌లో ముదిరిన సంక్షోభం.. అత్యవసర భేటీకి తాత్కాలిక ప్రధాని పిలుపు

ఈ మేరకు మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే మెదక్ జిల్లాకు రైలు సౌకర్యం కల్పించలేకపోయారి ఆయన విమర్శించారు. కానీ, సీఎం కేసీఆర్ కృషి వల్లే సిద్ధిపేట్ వరకు రైలు ప్రయాణం చేసేలా అధికారులు ట్రాక్ ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు.