Miss You First Look: ‘మిస్ యూ’ ఫ‌స్ట్ లుక్ విడుదల.. సరికొత్తగా సిద్దార్థ్!

Siddharth Miss You

Siddharth Miss You

Miss You Movie First Look Released: గ‌తేడాది ‘చిన్నా’ సినిమాతో మంచి విజ‌యాన్ని అందుకున్న తమిళ్ హీరో సిద్దార్థ్.. త్వరలో ‘ఇండియన్ 2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. తాజాగా సిద్దార్థ్ త‌న కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. సిద్దార్థ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘మిస్ యూ’. ఎన్ రాజ‌శేఖ‌ర్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ క‌థానాయిక‌గా నటిస్తోంది. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌ను నేడు విడుద‌ల చేశారు.

Also Read: Kanchana 4: ‘కాంచ‌న 4’ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది.. సమ్మర్ టార్గెట్!

×
×
Ad

తమిళ్ హీరో శివ కార్తికేయ‌న్ ఎక్స్ వేదిక‌గా మిస్ యూ ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశాడు. రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్‌పై సిద్దార్థ్ నడుస్తున్న చిత్రంను షేర్ చేశారు. చాల రోజుల తర్వాత సిద్దార్థ్ కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ ఫ‌స్ట్ లుక్‌ను మరో హీరో మాధవన్ కూడా రిలీజ్ చేశారు. 7 మైల్స్ ప‌ర్ సెకండ్ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై శామ్యూల్ మాథ్యూ మిస్ యూ సినిమాను నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. కరుణాకరన్, బాల, సాస్తిక రాజేంద్రన్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.