దీపక్ సరోజ్ పేరు అందరికీ తెలిసే ఉంటుంది.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సిద్ధార్థ్ రాయ్ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైంది. టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ సినిమా థియేటర్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.. సాంగ్స్ మాత్రం ఇప్పటికి వినిపిస్తూనే ఉన్నాయి.. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తుంది..
యశస్వి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తన్వి నెగి హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ విహిన్ క్రియేషన్స్ బ్యానర్‌లపై జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన సంయుక్తంగా నిర్మించారు.. ఇప్పుడు ఓటీటీలోకి ఈ సినిమా రాబోతుంది.. తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా సినిమా విడుదలను అధికారికంగా ప్రకటించింది..
ఈ సినిమా మే 3 నుంచి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. కమర్షియల్‌గా సక్సెస్ అందుకోలేకపోయినా దీపక్ నటనకు యూత్ ఫిదా అయ్యారు.. ఇండస్ట్రీలో అతని గురించే చర్చలు జరుగుతున్నాయి.. ఇక హీరోయిన్ తన అందాలతో యూత్ ను బాగా ఆకట్టుకుంది.. అర్జున్ రెడ్డిని మించి బోల్డ్ సీన్స్ ఉన్నాయి.. ఇక ఓటీటీ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి..