Site icon NTV Telugu

Siddharth-Allu Arjun: అల్లు అర్జున్‌తో ఏదైనా సమస్యా?.. సిద్ధార్థ్‌ సమాధానం ఇదే!

Siddharth Allu Arjun

Siddharth Allu Arjun

సిద్ధార్థ్‌ హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ డ్రామా ‘మిస్‌ యూ’. ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌. తమిళ డైరెక్టర్ రాజశేఖర్‌ దర్శకత్వం వహించగా.. 7 మైల్స్‌ పర్‌ సెకండ్‌ సంస్థ నిర్మించింది. ఈ సినిమా ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ సంస్థ ద్వారా డిసెంబర్ 13న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి మిస్‌ యూ నవంబర్ 29న రిలీజ్ కావాలి కానీ.. ‘పుష్ప 2’ కారణంగా వాయిదా పడింది. మిస్‌ యూ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న సిద్ధార్థ్‌.. ఇటీవల పుష్ప 2 ఈవెంట్‌కు వచ్చిన ప్రేక్షకులను ఉద్దేశించి కామెంట్స్‌ చేశారు. తాజాగా దానిపై ఆయన క్లారిటీ ఇచ్చారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధార్థ్‌.. పాట్నాలో జరిగిన పుష్ప 2 ఈవెంట్‌కు లక్షల్లో జనాలు రావడంపై పరోక్షంగా సెటైర్లు వేశారు. ‘సినిమాకు, ప్రమోషన్స్‌ ఈవెంట్‌లకు జనాలు రావడానికి సంబంధం లేదు. ఈరోజుల్లో ఏ పనులు జరుగుతున్నా.. చూడడానికి జనాలు భారీగా వస్తున్నారు’ అని సిద్ధార్థ్‌ అన్నారు. సిద్ధార్థ్‌ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. కొందరు ఆయన్ని విమర్శించారు కూడా. మిస్‌ యూ ప్రమోషన్‌లో భాగంగా చెన్నైలో నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్‌లో ‘మీకు అల్లు అర్జున్‌తో ఏదైనా సమస్య ఉందా?’ అనే ప్రశ్న సిద్ధార్థ్‌కు ఎదురైంది. తనకు ఎవరితోనూ సమస్యలు లేవని, పుష్ప 2 భారీ హిట్ కొట్టినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు.

Also Read: Gold Rate Today: మూడు రోజులుగా పెరిగిన ధరలకు బ్రేక్.. నేడు తులం బంగారం ఎంతుందంటే?

‘నాకు ఎవరితో సమస్యలు లేవు. పుష్ప 2 భారీ విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. పుష్ప సూపర్‌ సక్సెస్‌ అయింది. అందుకే సీక్వెల్‌ చూసేందుకు ప్రేక్షకులు భారీగా థియేటర్‌లకు వెళ్తున్నారు. ప్రమోషన్స్‌ ఈవెంట్‌లకు ఎంతమంది వస్తే అంత మంచిది. థియేటర్‌లకు కూడా అంతకంటే ఎక్కువగా జనాలు రావాలని కోరుకుందాం. ఇండస్ట్రీ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలి. నటీనటులం అంతా ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం. 100 సినిమాలు రిలీజ్ అయితే.. ఒకటి హిట్ అవుతుంది. ప్రతి ఒక్కరి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలి. మిస్‌ యూ మీకు నచ్చుతుంది. సినిమా బాగా వచ్చింది’ అని సిద్ధార్థ్‌ అన్నారు.

Exit mobile version