NTV Telugu Site icon

UP COP Fails to Load, Fire Rifle : గన్‎లో బుల్లెట్ ఎక్కడ పెట్టాలో తెలియదు.. ఇతనో ఎస్ఐ

Si In Up

Si In Up

UP COP Fails to Load, Fire Rifle : రైఫిల్ లోడ్ చేయడంలో యూపీ పోలీసు విఫలమయ్యాడు. సబ్-ఇన్‌స్పెక్టర్ రైఫిల్ లోడ్ చేయలేకపోయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఉత్తరప్రదేశ్ పోలీసులను తీవ్ర ఇబ్బందికి గురిచేసింది. యూపీ సంత్ కబీర్ నగర్‌లోని పలు పోలీస్ట్ స్టేషన్‌లను ఐజీ ఆర్కే భరద్వాజ్ ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఖలీలాబాద్ పోలీస్ స్టేషన్ సందర్శించారు. అక్కడ పోలీసుల పనితీరును గమనించే క్రమంలో వారికి గన్ ఫైరింగ్ పరీక్ష పెట్టారు. ఈ సమయంలో ఓ ఎస్సై ఐజీ ముందు అడ్డంగా బుక్కయ్యాడు.

Read Also: Bomb cyclone: గడ్డకట్టిన నయాగారా.. ఔరా అనిపిస్తున్న అద్భుత దృశ్యం

బుల్లెట్ లోడు చేసి పైకి గన్ కాల్చమని ఐజీ చెప్పగా అతడు అయోమయంలో పడ్డాడు. బుల్లెట్ ఎలా లోడు చేయాలో కూడా కనీసం తెలియక ఇబ్బంది పడ్డాడు. చివరికి రైఫిల్ గొట్టం ద్వారా బుల్లెట్ లోపలికి తోసేశాడు. ఇది చూసిన ఐజీ ఆ ఎస్ఐపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సబ్ ఇన్‌స్పెక్టర్ తో పాటు మరికొందరు పోలీసు అధికారులు తనిఖీల్లో కాల్పులు జరపలేకపోయారు. ఔట్ పోస్ట్ ఇన్ ఛార్జి కూడా పదేపదే ప్రయత్నించిన తర్వాత కూడా టియర్ గన్‌ని ఆపరేట్ చేయడంలో ఇబ్బంది పడ్డారు. దీనిపై ఐజి భరద్వాజ్ స్పందిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో సాధన, శిక్షణ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఎలాంటి అనూహ్యమైన మోహరింపులకు సిద్ధంగా ఉండేందుకు శిక్షణను కొనసాగించాలని ఆయన పోలీసు సిబ్బందిని ఆదేశించారు.