Shubman Gill Dance: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఐదో రోజు ఆటలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డీఆర్ఎస్ విజయవంతం కావడంతో గిల్ మైదానంలోనే డ్యాన్స్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 77వ ఓవర్ చివరి బంతికి ఈ ఘటన చోటుచేసుకుంది. భారత బౌలర్ అన్‌శుల్ కాంబోజ్ వేసిన బంతి టామ్ బ్లండెల్ బ్యాట్ అంచును తాకి వికెట్ కీపర్ రిషభ్ పంత్ చేతుల్లోకి వెళ్లింది. అయితే అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. బంతి బ్యాట్‌ను తాకినట్లు అనుమానం వ్యక్తం చేసిన కాంబోజ్‌తో పాటు భారత ఆటగాళ్లు అప్పీల్ చేశారు. ఈ క్రమంలో కెప్టెన్ గిల్ కూడా బంతికి ఏదో తగిలిన శబ్దం వచ్చిందని చెప్పి డీఆర్ఎస్ తీసుకున్నాడు. రిప్లేలో బంతి బ్యాట్ అంచును తాకినట్లు స్పష్టమైంది. స్నికోమీటర్‌లో స్వల్ప కదలిక కనిపించడంతో థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకుని బ్లండెల్‌ను ఔట్‌గా ప్రకటించాడు. దీంతో భారత ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఈ సందర్బంగా కెప్టెన్ గిల్ మైదానంలోనే డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. గిల్‌లో ఈ కొత్త యాంగిల్ చూసి అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులు చేసింది. అనంతరం భారత జట్టు కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ సెంచరీలతో పాటు ఇతర బ్యాటర్ల రాణింపుతో 9 వికెట్ల నష్టానికి 720 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 352 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ న్యూజిలాండ్ బ్యాటర్లు భారత బౌలర్ల ధాటికి తడబడుతున్నారు. ఐదో రోజు రెండో సెషన్‌లో తాజా సమాచారం ప్రకారం కివీస్ 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఇంకా భారత్ కంటే 150 పరుగులు వెనుకబడి ఉంది. చేతిలో ఐదు వికెట్లు మాత్రమే ఉండటంతో న్యూజిలాండ్‌పై ఇన్నింగ్స్ ఓటమి ప్రమాదం పొంచి ఉంది. మరోవైపు భారత బౌలర్లు మిగిలిన వికెట్లు త్వరగా పడగొట్టి ఇన్నింగ్స్ విజయాన్ని అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు.
Captain Shubman Gill dancing after Tom Blundell wicket. 😂🕺🏻 https://t.co/HJqabv3p0j
— Prince (@CoverDrive_77) November 23, 2026

