Site icon NTV Telugu

Shubman Gill: డబుల్ సెంచరీతో చరిత్రను తిరగరాసిన కెప్టెన్ గిల్.. ఏ రికార్డులను సాధించాడంటే..?

Shubman Gill

Shubman Gill

Shubman Gill: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన అద్భుత డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌ లో రెండో రోజు గిల్‌ తన టెస్ట్ కెరీర్‌ లోనే మొట్టమొదటి డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. ఇలా టెస్ట్ ఫార్మాట్‌లో ఇంగ్లాండ్ గడ్డపై డబుల్ సెంచరీ చేసిన తొలి భారతీయ, అలాగే తొలి ఆసియా కెప్టెన్‌గా గిల్ నిలిచాడు.

Read Also:Snake At Cricket Ground: అయ్యబాబోయ్.. మ్యాచ్ జరుగుతుండగానే మైదానంలో ప్రత్యక్షమైన పాము.. వీడియో వైరల్

ఈ మ్యాచ్‌లో గిల్ 311 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌ లో టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత బ్యాటర్‌గా చరిత్రలో నిలిచాడు. గతంలో ఈ రికార్డు 1979లో ది ఓవల్ వేదికగా సునీల్ గావస్కర్ చేసిన 221 పరుగుల పేరుతో ఉండేది. అలాగే 2002లో అదే వేదికపై రాహుల్ ద్రావిడ్ 217 పరుగుల వరకే పరిమితమయ్యాడు. కానీ, ఇప్పుడు గిల్ వీరిద్దరిని అధిగమించి కొత్త శిఖరాన్ని అధిరోహించాడు.

గిల్ ఈ సిరీస్‌లో లీడ్స్ వేదికగా తన తొలి టెస్ట్‌ మ్యాచ్‌ కెప్టెన్సీకి శుభారంభంగా 147 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో టెస్ట్‌లో 200 పరుగుల మైలురాయి దాటి తన సత్తా ఏంటో మరోసారి చాటాడు. జాష్ టంగ్ బౌలింగ్‌లో డీప్ ఫైన్‌ లెగ్ వైపు ఒక్క పరుగు తీసి తన డబుల్ సెంచరీ పూర్తిచేసిన గిల్.. ప్రత్యేక సెలబ్రేషన్‌తో ఆనందం పంచుకున్నాడు. ఈ డబుల్ సెంచరీతో గిల్ ఒకే సారిగా MAK పటౌడి, సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ వంటి భారత దిగ్గజ కెప్టెన్ల సరసన నిలిచాడు. కెప్టెన్‌ గా టెస్ట్‌లలో డబుల్ సెంచరీలు చేసిన వీరులు అరుదైన జాబితాలో గిల్ చేరిపోయాడు. ప్రస్తుతం ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 7 డబుల్ సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు.

Read Also:IND vs ENG Test: డబుల్ సెంచరీ దిశగా గిల్.. తృటిలో సెంచరీ మిస్ చేసుకున్న జడేజా..!

గిల్‌కి ముందు SENA (South Africa, England, New Zealand, Australia) దేశాల్లో టెస్ట్‌ లలో భారత కెప్టెన్‌గా అత్యధిక స్కోరు చేసిన ఆటగాడు మహ్మద్ అజారుద్దీన్ కు రికార్డ్ ఉండేది. ఆయన 1990లో న్యూజిలాండ్‌తో ఆడిన టెస్ట్‌లో 192 పరుగులు చేసిన విషయం తెలిసిందే. అలాగే అదే ఏడాది మాంచెస్టర్ వేదికగా అజారుద్దీన్ చేసిన 179 పరుగులే ఇంగ్లాండ్‌లో భారత కెప్టెన్‌గా అత్యధిక స్కోరుగా ఉండేది. ఇప్పుడు గిల్ ఆ రికార్డునూ అధిగమించాడు.

Exit mobile version