శృతి హాసన్ సోషల్ మీడియా వేదికగా తన హాట్ అందాల విందు చేసింది.శృతి హాసన్ లేటెస్ట్ లుక్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది.శృతి హాసన్ టాలీవుడ్ లో బిజీ స్టార్ హీరోయిన్.తన కమ్ బ్యాక్ తరువాత శృతి హాసన్ వరుస సినిమాలను చేసింది.. క్రాక్, వకీల్ సాబ్ వంటి విజయాలను అందుకోవడంతో ఈమె కెరీర్ మళ్ళీ ఊపందుకుంది..ఇప్పుడు శృతి హాసన్ కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తుంది.ఈ ఏడాది ఆరంభం లోనే రెండు భారీ విజయాలను అందుకుంది. సంక్రాంతి సందర్బంగా ఆమె నటించిన వాల్తేరు వీరయ్య మరియు వీరసింహారెడ్డి చిత్రాలు విడుదలయి మంచి విజయం సాధించాయి.ఈ రెండు చిత్రాల విజయంతో శృతి హాసన్ సంక్రాంతి హీరోయిన్ గా మారింది.ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. శృతి ఈ రెండు చిత్రాలకు భారీగా రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తుంది.
అలాగే ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆమె పార్ట్ షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు శృతికి సలార్ చిత్ర విజయం చాలా ముఖ్యం.. ఈ భారీ పాన్ ఇండియా మూవీ విజయం సాధిస్తే శృతి కెరీర్ మరో దశకు చేరుతుందని చెప్పొచ్చు.. సలార్ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కానుంది. సలార్ సినిమా ఇప్పటికే చాలా వరకు షూట్ జరుపుకుంది.జులై 7 ఈ చిత్ర టీజర్ కూడా విడుదల కాబోతున్నట్లు సమాచారం.శృతి ముంబైకి చెందిన శాంతను హజారికతో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే… శాంతను డూడుల్ ఆర్టిస్ట్. రెండేళ్లకు పైగా నే శాంతను-శృతి హాసన్ ఇద్దరు కలిసి జీవిస్తున్నారు.ఇంతకు ముందు శృతి హాసన్ లండన్ కి చెందిన మైకేల్ కోర్స్లే అనే వ్యక్తితో రిలేషన్ లో ఉంది.. వీరిద్దరూ వివాహం చేసుకుంటారనే ప్రచారం అప్పట్లో బాగా జరిగింది. అనూహ్యంగా వీరు బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ సమయంలో శృతి డిప్రెషన్ లోకి కూడా వెళ్ళింది.ఆ సమయంలో సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం శృతి ఎంతో సంతోషంగా ఉంది.