ఇండస్ట్రీ లో ఎంతటి స్టార్ ల బాక్గ్రౌండ్ వున్న కానీ టాలెంట్ కనుక లేకపోతే ప్రేక్షకులు ఆదరించరు. టాలెంట్ ఉంటే ఎలాంటి బాక్గ్రౌండ్ అవసరం లేదు. ప్రేక్షకులు వారికి తిరుగులేని విజయాన్ని అందిస్తారు.. అలాంటి వారిలో శృతి హాసన్ కూడా ఒకరు. విశ్వ నటుడు కమల్ హాసన కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శృతిహానస్. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందుకు పలు సినిమాల్లో గెస్ట్ రోల్స్ కూడా చేసింది శృతి.ఆ తర్వాత అనగనగ ఓ ధీరుడు అనే సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. మొదటి సినిమాతోనే అందం అభినయంతో అందరిని ఆకట్టుకుంది శృతి. కానీ ఆ సినిమా కమర్షియల్ గా అంతగా హిట్ కాలేదు. ఆతర్వాత ఆమెకు పవర్ స్టార్ గబ్బర్ సింగ్ తో భారీ హిట్ లభించింది.ఆ సినిమా తరువాత ఆమెకు భారీగా అవకాశాలు వచ్చాయి.
తెలుగు తో పాటు తమిళ్ మరియు హిందీలో కూడా సినిమా అవకాశాలు వచ్చాయి.. అలాగే ఈ అమ్మడిలో మరొక టాలెంట్ కూడా ఉంది. ఆమె సినిమాలలోకి రాకముందు ఆమె ఒక సింగర్. తన బ్యూటిఫుల్ వాయిస్ తో పాటలను పాడుతుంది.ప్రస్తుతం శృతి టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవితో చేసిన వాల్తేరు వీరయ్య మరియు బాలయ్యతో కలిసి చేసిన వీరసింహారెడ్డి సినిమాలు ఆమెకు మంచి సక్సెస్ ని ఇచ్చాయి.ఆమె పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి సలార్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది.. అలాగే నేచురల్ స్టార్ నానితో కూడా కలిసి నటిస్తుంది.ఈ అమ్మడు ఖాళీ సమయంలో సోషల్ మీడియాలోని తన అభిమానులతో చాట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు అభిమానులతో మాట్లాడినట్లు సమాచారం. ఈ క్రమంలో ఓ నెటిజన్ ఆమెను మీరు మద్యం తాగుతారా..అని ప్రశ్నించాడటా. దానికి శృతి సింపుల్ గా..లేదు నేను మద్యం తాగను అలాగే ఎలాంటి మాదక ద్రవ్యాలను కూడా నేను తీసుకోను అని బదులిచ్చింది..నేను ఎంతో ఆనందంగా నా లైఫ్ ని లీడ్ చేస్తున్నాను. నాకు అలాంటి అలవాట్లు లేవు అంటూ సమాధానమిచ్చింది.