NTV Telugu Site icon

Shriya : 20ఏళ్ల తర్వాత చిరుతో చిందేయనున్న శ్రియ

Shriya Sharan

Shriya Sharan

Shriya : ఇష్టం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రియ అనతికాలంలోనే అగ్రతారగా ఎదిగింది. దాదాపు 20ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. 20ఏళ్లయిన చెక్కుచెదరని అందంతో ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. కెరీర్ ప్రారంభించిన తక్కువ కాలంలో స్టార్‌‌ హీరోయిన్‌ గా మారిన ఆమె యువ నటులతో పాటు బడా హీరోలతోనూ నటించింది. 2003లో వచ్చిన బ్లాక్ బస్టర్ ఠాగూర్ చిత్రంలో చిరు సరసన శ్రియ హీరోయిన్ గా నటించింది. నటనతో పాటు చిరుతో సమానంగా స్టెప్పులు వేసి అదరహో అనిపించుకుంది. తాజా శ్రియ మరోసారి మెగాస్టార్ చిరుతో మాస్ స్టెప్పులు వేయనుంది.

Read Also: Sharath Babu: సీనియర్ నటుడు శరత్ బాబుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ‘భోళా శంకర్‌‌’ చిత్రంలోని ఐటం సాంగ్ కోసం శ్రియను సంప్రదించినట్లు తెలుస్తోంది. చాలా మందిని అడిగిన తర్వాత చిరుతో పోటాపోటీగా డ్యాన్స్ చేయగలిగేది శ్రియనే అని చిత్ర బృందం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ ఆఫర్ కు వెంటనే ఒప్పుకున్న శ్రియ చిరుతో చిందేయడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. పలు చిత్రాల్లో ఇప్పటికే పదుల సంఖ్యలో స్పెషల్ సాంగ్స్ చేసిన శ్రియతో మెగాస్టార్ తో స్పెషల్ నంబర్ మరింత ప్రత్యేకంగా ఉండనుంది. ఈ పాట కోసం శ్రియా రూ. కోటి పారితోషికం తీసుకుంటున్నట్టు సమాచారం.

Read Also: PS-2: కమల్ చెప్తే చూసేస్తారా? ఇంకా తమిళ సినిమాగానే ప్రమోట్ చేస్తున్నారు