Site icon NTV Telugu

Shriya Saran: “అది నేను కాదు” – ఫేక్‌ వాట్సప్‌ అకౌంట్‌ పై స్పందించిన శ్రియ

Sreya Sanan

Sreya Sanan

సోషల్ మీడియాలో సెలబ్రిటీల పేరుతో నకిలీ అకౌంట్లు సృష్టించడం కొత్తేమీ కాదు. తాజాగా నటి శ్రియ శరణ్ కూడా ఇటువంటి మోసపూరిత ప్రయత్నం బారిన పడ్డారు. ఆమె పేరుతో నకిలీ వాట్సప్ నంబర్ యాక్టివ్‌గా ఉండి, వ్యక్తులు మరియు ఇండస్ట్రీ కి చెందిన వారికి మెసేజ్‌లు పంపుతున్నారనే విషయం బయటకు రావడంతో, స్వయంగా శ్రియ స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సందేశంలో శ్రియ ఇలా తెలిపారు..

Also Read : Andhra King Taluka: ఇది నా వ్యక్తిగత చిత్రం – రామ్ ఎమోషనల్ స్పీచ్ వైరల్

“ఈ వాట్సప్ ఎవరిదో నాకు తెలియదు. దయచేసి ఇలాంటి నంబర్లతో మాట్లాడి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఇది నేను కాదు. ఆ నెంబర్ నాది కాదు. భాద పడిన విషయం ఏమిటంటే ఈ వ్యక్తి నా సన్నిహితులు, నేను పని చేయబోయే వ్యక్తులకు కూడా మెసేజ్‌లు పంపుతున్నాడు. అందరూ జాగ్రత్తగా ఉండండి” అని హెచ్చరించింది. ఇక ఇటీవల ఇదే తరహా ఘటన నటి అదితి రావు హైదరి విషయంలోనూ జరిగింది. ఆమె పేరుతో నకిలీ వాట్సప్ అకౌంట్ సృష్టించి, ఫోటోషూట్ పేరుతో పలువురు ఫోటోగ్రాఫర్లను సంప్రదించినట్లు తెలిసింది. వెంటనే స్పందించిన అదితి “ఫోటో షూట్ వంటి పనుల కోసం నేను ఎప్పటికీ వ్యక్తిగత నంబర్‌ నుంచి మెసేజ్ చేయను. నా టీమ్ ద్వారానే కమ్యూనికేషన్ జరుగుతుంది. అలాంటి ఫేక్ మెసేజ్‌లు వస్తే మా అధికారిక ఇన్‌స్టా కి సమాచారం ఇవ్వండి.” అని విజ్ఞప్తి చేశారు. సెలబ్రిటీల పేరుతో జరుగుతున్న ఇలాంటి మోసపూరిత చర్యలు పెరుగుతున్న నేపథ్యంలో అభిమానులు, ఫోటోగ్రాఫర్లు, మరియు ఇండస్ట్రీ వ్యక్తులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మరింత పెరిగింది.

Exit mobile version