NTV Telugu Site icon

Shreyas Iyer Century: ఆ లక్ష్యంతోనే బ్యాటింగ్‌ చేశా.. సెంచరీపై శ్రేయస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

Shreyas Iyer Century

Shreyas Iyer Century

Shreyas Iyer Said I have worked a lot on straight shot: వెన్ను గాయంతో ఆరు నెలల పాటు క్రికెట్‌కు దూరమైన టీమిండియా స్టార్ పేసర్ శ్రేయస్‌ అయ్యర్‌.. ఆసియా కప్‌ 2023లో పునరాగమనం చేశాడు. అయితే రెండు మ్యాచ్‌లు ఆడాక అయ్యర్‌కు మళ్లీ ఫిట్‌నెస్‌ సమస్యలు తలెత్తాయి. దాంతో వన్డే ప్రపంచకప్‌ 2023లో అయ్యర్ ఏ మేరకు రాణిస్తాడో అన్న అనుమానాలు అందరిలో కలిగాయి. వెన్నుగాయం నుంచి పూర్తిగా కోలుకున్న అయ్యర్‌.. ప్రపంచకప్‌ 2023లో అదరగొడుతున్నాడు. లీగ్ దశలో 9 మ్యాచ్‌లు ఆడిన అయ్యర్ 421 రన్స్ చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. ఆదివారం బెంగళూరులో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (128 నాటౌట్) సెంచరీ చేశాడు. ఈ శతకంపై శ్రేయస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ 84 బంతుల్లో సెంచరీ చేశాడు. మొత్తంగా 94 బంతుల్లో 128 పరుగులు బాదాడు. వన్డే క్రికెట్‌లో అతనికి ఇది నాల్గవ శతకం కాగా.. ప్రపంచకప్‌లో ఇదే మొదటిది. అద్భుత శతకం చేసిన అయ్యర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ప్రెసెంటేషన్ సందర్భంగా శ్రేయస్‌ అయ్యర్‌ మాట్లాడుతూ… ‘చాలా రోజుల తర్వాత సెంచరీ చేయడం ఆనందంగా ఉంది. ఆస్ట్రేలియా మ్యాచ్‌లో అనవసరంగా వికెట్‌ సమర్పించుకున్నా. ఈసారి నాటౌట్‌గా ఉండాలని మైదానంలోకి వచ్చా. అందుకు తగ్గట్టుగానే ఎక్కడా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు’ అని తెలిపాడు.

Also Read: Rohit Sharma: వరుస విజయాలు.. భారత్ గేమ్‌ ప్లాన్‌ ఏంటో చెప్పేసిన రోహిత్!

‘ఓ షాట్ ఆడిన తర్వాత కండరాలు పట్టేయడంతో మధ్యలో టాబ్లెట్స్ తీసుకున్నా. గత మ్యాచుల్లో ఇన్నింగ్స్‌ల ద్వారా నాలో కాన్ఫిడెంట్ పెరిగింది. బెంగళూరు వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. ఈరోజు శుభారంభాన్ని సద్వినియోగం చేసుకుని ఆడాను. వికెట్ల మీదుగా షాట్ (స్ట్రెయిట్ షాట్) కొట్టడంపై చాలా శ్రమించా’ అని శ్రేయస్‌ అయ్యర్‌ చెప్పాడు. అయ్యర్ సహా కేఎల్ రాహుల్ కూడా ప్రపంచకప్‌ 2023 ముందు గాయాలతో సతమతం అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరూ పరుగుల వరద పారిస్తున్నారు. తమపై ఉన్న అపోహలను ఇద్దరు పటాపంచలు చేశారు.