దులీప్ ట్రోఫీలో స్టార్ ఆటగాళ్ళు ఆడటం వల్ల యువతలో స్ఫూర్తి నింపినట్లు అవుతుందని భారత జట్టు స్టార్ ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్ అన్నారు. అనంతపురంలో జరిగే దులీప్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లో ఆడుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. దేశవాళీ క్రికెట్లో పాల్గొనటం ద్వారా నైపుణ్యాలను మరింతగా పెంచుకోవచ్చన్నారు. కాగా.. ‘అనంత’లో దులీఫ్ ట్రోఫీ సందండి నెలకొంది. రేపటి నుంచి మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో ఈనెల 5 నుంచి 22వ తేదీ వరకు దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. మ్యాచ్ లు వీక్షించేందుకు 4,000 వేల పాసులను నిర్వాహకులు పంపిణీ చేశారు. స్టార్ స్పోట్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. సీ, డీ జట్లు ఇప్పటికే ప్రాక్టీస్ లో పాల్గొన్నాయి.
READ MORE: Sam Pitroda: “రాజీవ్ గాంధీ కంటే రాహుల్ గాంధీ మేధావి. ప్రధాని అయ్యే అన్ని లక్షణాలు ఉన్నాయ్”
ఇండియా – ‘సీ’ టీమ్ సభ్యులు
రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్, ఇంద్రజిత్, హతిక్ షోకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్.
ఇండియా – ‘డీ’ టీమ్ సభ్యులు
శ్రేయాస్ లైయర్, అథర్వ తైడే, యశ్‌దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాక్ కిషన్, రికీ భుయ్, సరాంశ్ జైన్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, ఆదిత్య థాకరే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్ పాండే, ఆకాష్ సేన్‌గుప్తా, సౌరభ్‌కుమార్
READ MORE: Mahesh Vs Pawan: ‘గబ్బర్ సింగ్’ను కొట్టేలా ఏడాది ముందు నుంచే ప్లానింగ్?