NTV Telugu Site icon

Shreyas Iyer: పాపం శ్రేయస్ అయ్యర్‌.. మళ్లీ నిరాశే! ఇప్పట్లో కష్టమే

Shreyas Iyer

Shreyas Iyer

Shreyas Iyer To Play Ranji Trophy For Mumbai: టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు మరోసారి నిరాశ తప్పేలా లేదు. ఇప్పటికే బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌కు ఎంపిక కాని శ్రేయస్.. న్యూజీలాండ్ టెస్ట్ సిరీస్‌కు సైతం ఎంపికయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే.. శ్రేయస్‌ రంజీ ట్రోఫీకి ఎంపికయ్యాడు. ముంబై రంజీ జట్టు తరఫున అతడు ఆడనున్నాడు. శ్రేయస్ ఇప్పట్లో భారత జట్టుకు ఆడే అవకాశాలు కనిపించడం లేదు. రంజీ ట్రోఫీలో అయినా బాగా ఆడితే.. నవంబర్‌లో ప్రారంభం కానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఎంపికయ్యే అవకాశం ఉంది.

ఈ ఏడాది ఆరంభంలో విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్‌ చివరగా ఆడాడు. ఆ టెస్టులో పేలవమైన ప్రదర్శన చేయడంతో సిరీస్‌లోని మిగిలిన మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇటీవల భారత్ ఎక్కువగా టీ20లే ఆడింది. బంగ్లాతో టెస్ట్ సిరీస్‌కు శ్రేయస్ ఎంపిక కాలేదు. ఇటీవల జరిగిన దులీప్‌ ట్రోఫీలో 154 పరుగులే చేశాడు. రెస్టాఫ్‌ ఇండియాతో జరిగిన ఇరానీ కప్‌ మ్యాచ్‌లో ముంబై తరఫున ఆడిన శ్రేయస్ పెద్దగా ఆకట్టుకోలేదు. తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసినా.. రెండో ఇన్నింగ్స్‌లో 8కే ఔటయ్యాడు. దాంతో అతడిని న్యూజీలాండ్ టెస్ట్ సిరీస్‌కు కాకుండా.. రంజీ ట్రోఫీకి బీసీసీఐ ఎంపిక చేసింది.

Also Read: Vinesh Phogat: హర్యానా అసెంబ్లీ ఎన్నికలు.. వినేష్ ఫొగట్ ఘన విజయం!

అక్టోబర్‌ 16 నుంచి భారత్, న్యూజీలాండ్ మధ్య మూడు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 16 నుంచి బెంగళూరులో మొదటి టెస్ట్, అక్టోబర్‌ 24 నుంచి పూణేలో రెండో టెస్ట్, నవంబర్ 1 నుంచి ముంబైలో మూడో టెస్ట్ ఆరంభం కానుంది. శ్రేయస్‌ అయ్యర్ రంజీ ట్రోఫీకి ఎంపికవ్వడంతో.. కివీస్‌ సిరీస్‌లో సర్పరాజ్‌ ఖాన్‌ ఎంపికకు లైన్ క్లియర్ అయినట్లే.

Show comments