ఇటీవల ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ గాయపడ్డ విషయం తెలిసిందే. ప్లీహానికి తీవ్ర గాయం కావడంతో ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నాడు. ప్రాణాంతక గాయంపై బీసీసీఐ బుధవారం ఓ అప్‌డేట్ ఇచ్చింది. శస్త్రచికిత్స అవసరం లేకుండానే ప్లీహం వద్ద రక్తస్రావం ఆగిపోయేలా డాక్టర్లు చికిత్స అందించినట్లు తెలిపింది. మరో 4-5 రోజుల్లో శ్రేయస్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో శ్రేయస్ తన ఆరోగ్యంపై స్వయంగా ఓ అప్‌డేట్ ఇచ్చాడు.
ప్రస్తుతం తాను కోలుకుంటున్నా అని, రోజు రోజుకు మెరుగవుతూ ఉన్నా అని శ్రేయస్ అయ్యర్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు. ‘ప్రస్తుతం నేను కోలుకునే ప్రాసెస్‌లో ఉన్నా. రోజు రోజుకు నా ఆరోగ్యం మెరుగవుతుంది. మీ అందరి దీవెనలతో త్వరలోనే మైదానంలోకి వస్తా. నా పట్ల మీరు చూపిన ప్రేమను ఎప్పటికీ మరిచిపోలేను. ప్రతిఒక్కరికీ నా కృతజ్ఞతలు. నా గురించి నిత్యం ఆలోచిస్తున్నందుకు ధన్యవాదాలు’ అని శ్రేయస్ పేర్కొన్నాడు. శ్రేయస్ పోస్ట్ చేయడంతో ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాంతక ప్రమాదం నుంచి మాత్రం బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శ్రేయస్ త్వరలోనే మైదానంలోకి అడుగుపెడతాడని ఆశిస్తున్నారు.
Also Read: Gold Price Today: ఇది కదా కావాల్సింది.. ఊహించని రీతిలో తగ్గిన బంగారం ధరలు!
శ్రేయాస్ అయ్యర్ కనీసం రెండు నెలల పాటు ఆటకు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎనిమిది వారాల పాటు మైదానంలోకి దిగడు. నవంబర్-డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల స్వదేశీ వన్డే సిరీస్‌కు దూరం కానున్నాడు. జనవరి 11 నుండి న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో అతను పాల్గొనడం కూడా డౌటే. ఎందుకంటే అప్పటివరకు ఫిట్‌నెస్ సాధిస్తాడా లేదో. 2025 టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైతే బరిలోకి దిగుతాడు. శ్రేయాస్ ఎంత త్వరగా కోలుకుంటాడో చూడాలి.
— Shreyas Iyer (@ShreyasIyer15) October 30, 2025
