దులీప్ ట్రోఫీలో ఇండియా ‘ఎ’ జట్టు ఇండియా ‘డి’తో తలపడుతోంది. అనంతపురంలోని రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని ఇండియా ఎ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులు చేసింది. ఈ క్రమంలో.. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని ఇండియా డి జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులు చేసింది. అయితే.. ఈ మ్యాచ్లో శ్రేయాస్ అయ్యర్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. ఏడు బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. అయితే.. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శ్రేయాస్ సన్ గ్లాసెస్ ధరించి క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో.. ఆయన్ను క్రికెట్ అభిమానులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
Read Also: Jr NTR Fan: క్యాన్సర్ తో అంపశయ్యపై అభిమాని.. దేవర వీడియో కాల్
భారత టెస్టు జట్టులో పునరాగమనం చేసేందుకు ప్రయత్నిస్తున్న శ్రేయాస్ అయ్యర్.. దులీప్ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేయాలని భారీ అంచనాలు పెట్టుకున్నాడు. అయితే ఈ టోర్నీలో ఇప్పటివరకు పెద్దగా రాణించలేదు. అటు.. బ్యాట్‌తో విఫలమవడంతో పాటు అతని సన్ గ్లాసెస్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. సన్ గ్లాసెస్ పెట్టుకుని క్రీజులోకి రావడంపై అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.
Read Also: Smart Tv: రూ. 15,000 ధరలో స్మార్ట్ టీవీలు.. ఓ సారి లుక్కేయండి..!
ప్రస్తుతం శ్రేయాస్.. టెస్టులు, టీ20ల్లో టీమిండియాకు దూరమై దేశవాళీ క్రికెట్‌లో మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. అంతకుముందు శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు.. కానీ అందులోనూ ఫ్లాప్ అయ్యాడు. ఈ క్రమంలో.. ప్రస్తుతం భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో అతనికి స్థానం దొరుకుతుందా లేదా అన్న అనుమానాలు వస్తున్నాయి. దులీప్ ట్రోఫీలో గత మూడు ఇన్నింగ్స్‌ల్లో శ్రేయాస్ 9, 54, 0 పరుగులు చేశాడు. కాగా.. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో భారత్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. దీనికి సంబంధించిన జట్టును త్వరలో ప్రకటించనున్నారు.
Shreyas Iyer batting by wearing Sunglasses 😎 pic.twitter.com/G8p9eBN1aQ
— Johns. (@CricCrazyJohns) September 13, 2024