NTV Telugu Site icon

Shreyas Iyer Record: ఐపీఎల్‌లో శ్రేయస్ అయ్యర్ చరిత్ర.. ఎంఎస్ ధోనీ రికార్డు బ్రేక్!

Shreyas Iyer Ms Dhoni Record

Shreyas Iyer Ms Dhoni Record

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యధిక వరుస విజయాలు అందుకున్న రెండో కెప్టెన్‌గా రికార్డుల్లో నిలిచాడు. సారథిగా శ్రేయస్ వరుసగా 8 విజయాలు సాధించాడు. ఈ ఐపీఎల్ ఎడిషన్‌లో మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌పై పంజాబ్ విజయం సాధించడంతో శ్రేయస్ ఈ రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున సారథిగా ఆరు విజయాలు సాధించిన శ్రేయస్.. ఐపీఎల్ 2025లో పంజాబ్ తరఫున రెండు విజయాలు ఖాతాలో వేసుకున్నాడు.

శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం షేన్‌ వార్న్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. 2008లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా వార్న్‌ 8 విజయాలు సాధించాడు. లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డును శ్రేయస్ అయ్యర్ బ్రేక్ చేశాడు. 2013లో చెన్నై సారథిగా ఏడు వరుస విజయాలు సాధించి.. మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో గౌతమ్ గంభీర్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2014-15లో గౌతీ కేకేఆర్ తరఫున 10 వరుస విజయాలు అందుకున్నాడు.

Also Read: IPL 2025: సంజీవ్ గోయెంకా.. ఆ అలవాటు మంచిది కాదయ్య!

కెప్టెన్‌గా ఐపీఎల్‌లో వరుసగా అత్యధిక విజయాలు:
10 – గౌతమ్ గంభీర్ (కోల్‌కతా నైట్ రైడర్స్) – 2014-15
8 – షేన్ వార్న్ (రాజస్థాన్ రాయల్స్) – 2008
8 – శ్రేయాస్ అయ్యర్ (కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్) – 2024-25
7 – ఎంఎస్ ధోనీ (చెన్నై సూపర్ కింగ్స్) – 2013
6 – గౌతమ్ గంభీర్ (కోల్‌కతా నైట్ రైడర్స్) – 2012
6 – ఎంఎస్ ధోనీ (చెన్నై సూపర్ కింగ్స్) – 2014
6 – కేన్ విలియమ్సన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) – 2018
6 – ఎంఎస్ ధోనీ (చెన్నై సూపర్ కింగ్స్) – 2019
6 – ఫాఫ్ డుప్లెసిస్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) – 2024