NTV Telugu Site icon

Srisailam: శ్రీశైలంలో ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 15 వరకు శ్రావణ మాసోత్సవాలు

Srisailam

Srisailam

Srisailam: శ్రీశైలంలో ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 15 వరకు శ్రావణ మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం నిర్ణయించింది. శ్రావణమాస పర్వదినాలలో రద్దీ దృష్ట్యా ఆర్జిత అభిషేకాలు నిలుపుదల చేసినట్లు తెలిపింది. ఈ సంవత్సరం అధికశ్రావణమాసం ఈనెల 18 నుంచే రావడంతో భక్తుల రద్దీ పెరుగుతుందన్న అంచనాతో దేవస్థానం నిర్ణయం తీసుకుంది. అధిక శ్రవణ మాసం కారణంగా ఆగష్టు 12 నుండే మాసంతం వరకు శని,ఆది,సోమవారాల్లో ఆర్జిత అభిషేకాలు నిలుపుదల చేశారు.

Also Read: Kishan Reddy : కేసీఆర్‌ అసెంబ్లీకి అర్థం లేకుండా చేశారు

ఆగస్టులో జలాశయం గేట్లు ఎత్తితే రద్దీ పెరుగుతుందని శని,ఆది,సోమవారాల్లో గర్భాలయ,సామూహిక అభిషేకాలు నిలుపుదల చేశారు. శ్రావణమాసంలోను శని,ఆది, సోమవారాల్లో స్లాట్ ప్రకారం యధావిధిగా శ్రీస్వామివారి స్పర్శ దర్శనానికి భక్తులను అనుమతి ఇచ్చారు. ఆర్జిత సేవ,స్పర్శ దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో లభ్యతను బట్టి శ్రీశైలం రావాలని భక్తులను దేవస్థానం కోరింది.