Shpageeza Cricket League: అఫ్గానిస్థాన్ ప్రీమియర్ టీ20 టోర్నీ అయిన స్పాగేజా క్రికెట్ లీగ్ 2025లో క్రికెట్ ప్రియులను ఆశ్చర్యపరిచే అరుదైన సంఘటన చోటుచేసుకుంది. అఫ్గానిస్థాన్ క్రికెట్ దిగ్గజం మహ్మద్ నబీ, అతడి కుమారుడు హసన్ ఐసాఖిల్ ఒకే మ్యాచ్‌లో ప్రత్యర్థులుగా తలపడ్డారు. ఈ మ్యాచ్‌లో మిస్ ఐనక్ రీజియన్ తరఫున మహ్మద్ నబీ ఆడగా, అతడి కుమారుడు హసన్ ఐసాఖిల్ అమో రీజియన్ తరఫున బరిలోకి దిగాడు. మ్యాచ్‌లో తొమ్మిదో ఓవర్ వేయడానికి నబీ బౌలింగ్‌కు వచ్చాడు. ఆ ఓవర్ తొలి బంతిని హసన్ ఎదుర్కొన్నాడు. అయితే ఎలాంటి భయం లేకుండా నేరుగా మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్స్ కొట్టి తన సత్తా చాటాడు.
ఇక్కడ వింత ఏంటంటే.. కొడుకు సిక్స్ కొట్టినా తండ్రి నబీ ఎలాంటి ఎమోషన్ చూపించలేదు. సాధారణంగా ఇలా కొడుకుని చూస్తే ఆనందంగా ఫీలవ్వడం సహజం. కానీ, నబీ మాత్రం తన ప్రొఫెషనలిజాన్ని చాటుతూ భావోద్వేగాలను అదుపులో ఉంచాడు. ఆ ఓవర్‌లో మొత్తం 12 పరుగులు వచ్చాయి. అయితే నబీ ఆ తర్వాత బౌలింగ్‌కు రాలేదు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మిస్ ఐనక్ 5 వికెట్లతో విజయం సాధించింది.
అమో రీజియన్ తొలుత బ్యాటింగ్ చేసి 19.4 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ ఇన్నింగ్స్ లో హసన్ ఐసాఖిల్ 52, షహిదుల్లా 45, ఇమ్రాన్ మీర్ 24 పరుగులతో రాణించారు. మిస్ ఐనక్ బౌలర్లలో నవీద్ జద్రాన్ 4 వికెట్లు తీయగా, ఖలీల్ గుర్బజ్ 3 వికెట్లు తీశారు ఇక ఆ తర్వాత మిస్ ఐనక్ లక్ష్యాన్ని 17 ఓవర్లలో చేధించి 5 వికెట్లతో విజయం సాధించింది. వఫీఉల్లా స్టానిక్జై 49, ఖాలిద్ తనీవాల్ 56 రాణించారు. అమో రీజియన్ బౌలర్లలో కైస్ అహ్మద్ 2 వికెట్లు, యామిన్ అహ్మద్‌జాయ్, అఫ్తాబ్ ఆలమ్ తలతలా ఒక వికెట్ తీసారు.
AB Devilliers: అసలేందుకు రిటైర్ అయ్యావు బాసు.. ఈ వయసులో కూడా దూకుడు తగ్గలేదుగా.. వీడియో వైరల్!
కేవలం 18 ఏళ్ల వయసులోనే తన టాలెంట్‌ను చాటిన హసన్, ఈ మ్యాచ్‌లో తన తండ్రికి చెమటలు పట్టించాడు. 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 52 పరుగులు చేసి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఘటనే మ్యాచ్ టాక్ అయింది. సోషల్ మీడియాలో ఈ తండ్రీ-కుమారుడి కాంబినేషన్ సంబంధించిన వీడియో హల్చల్ చేస్తోంది.
SON HITTING FATHER FOR A SIX.
– Hassan Eisakhil welcomed his father Mohammad Nabi with a six. 😄pic.twitter.com/2T1gzzXkzq
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 22, 2025
