NTV Telugu Site icon

Molestation : విమానంలో పోర్న్ చూస్తూ పక్క మహిళపై చేతులేసిన ఉన్నతాధికారి

New Project 2024 07 20t123537.337

New Project 2024 07 20t123537.337

Molestation : కోల్‌కతా నుంచి అబుదాబి వెళ్లే ఎతిహాద్ విమానంలో బోస్టన్‌కు వెళ్తున్న ఓ మహిళ జిందాల్ స్టీల్స్ సీనియర్ అధికారి దినేష్ కుమార్ సరోగీపై పలు తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రయాణంలో అతను తనకు పోర్న్ క్లిప్ చూపించడానికి ప్రయత్నించాడని మహిళ చెప్పింది. దాంతో పాటు తనను వేధింపులకు గురి చేసినట్లు ఆమె పేర్కొంది. ఆ మహిళ తన అనుభవాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పంచుకుంది. తన పోస్ట్‌లో మహిళ విమానంలో జరిగిన సంఘటనను నివేదించినప్పుడు ఎయిర్‌లైన్ సిబ్బంది సహాయానికి కృతజ్ఞతలు తెలిపింది. జిందాల్ స్టీల్ విభాగానికి చెందిన వల్కన్ గ్రీన్ స్టీల్ సీఈవో దినేష్ సరోగి ప్రయాణంలో తనకు పోర్న్ ఫిల్మ్ చూపించారని ఆ మహిళ ఆరోపించింది.

Read Also:Telangana: వానకాలంలో కంకులకు డిమాండ్‌.. కర్ణాటక, మహారాష్ట్ర దిగుమతి..

సోషల్ మీడియాలో.. “నేను ఒక పారిశ్రామికవేత్త పక్కన కూర్చున్నాను. అతని వయస్సు దాదాపు 65 సంవత్సరాలు ఉంటుంది. అతను ఇప్పుడు ఒమన్‌లో నివసిస్తున్నానని, కానీ తరచూ భారతదేశానికి వెళుతున్నానని నాతో చెప్పాడు. అతను నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. నా కుటుంబం తదితర విషయాలను అడిగారు. తన కొడుకులిద్దరూ పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారని చెప్పారు. నన్ను సినిమాలు చూడటం ఇష్టమా అని అడిగాడు. నేను అవును అని చెప్పాను. దీని తర్వాత తన ఫోన్‌లో కొన్ని సినిమా క్లిప్‌లు ఉన్నాయని చెప్పాడు. అతను తన ఫోన్, ఇయర్‌ఫోన్‌లను తీసి నాకు పోర్న్ చూపించడం ప్రారంభించాడు. అవి చూస్తూ అతను నన్ను తాకడం ప్రారంభించాడు. నేను షాక్, భయంతో స్తంభించిపోయాను. చివరికి నేను వాష్‌రూమ్‌కి పరిగెత్తి ఎయిర్ స్టాఫ్‌కి ఫిర్యాదు చేశాను. ఎతిహాద్ బృందం అలర్ట్ అయింది. వెంటనే చర్యలు తీసుకున్నారు. నాకు టీ, పండ్లు ఇచ్చారు.” అంటూ రాసుకొచ్చారు. జిందాల్ స్టీల్ చైర్మన్ నవీన్ జిందాల్ ఈ విషయంపై వీలైనంత త్వరగా విచారణ జరిపి అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహిళకు హామీ ఇచ్చారు. సరయోగి తన సీటు నుండి లేచిన తర్వాత తన ఆచూకీ గురించి ఎయిర్‌లైన్ సిబ్బందిని అడిగారని మహిళ ఆరోపించింది.

Read Also:Minister Atchannaidu: వ్యవసాయ అధికారులకు మంత్రి అచ్చెన్న కీలక ఆదేశాలు..

Show comments