కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ కంగువ. సూర్య అభిమానులు కంగువ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు.పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నాడు.సూర్య 42 వ సినిమా గా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గ్లింప్స్ వీడియో మరియు కంగువ పోస్టర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి…ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచుతున్నాయి.స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న కంగువ ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.2024 వేసవిలో విడుదల కావలసిన కంగువ మూవీ వాయిదా పడినట్లు సమాచారం. ఈ సినిమాను సెప్టెంబర్‌లోకానీ లేదా దీపావళికి విడుదల చేసేలా సూర్య టీం ప్లాన్ చేస్తున్నారని ఇప్పటికే ఓ అప్‌డేట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. తాజా అప్‌డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం సూర్య టీం హైదరాబాద్ షూటింగ్ షెడ్యూల్‌లో పాల్గొంటున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. బాబీడియోల్ ఇప్పటికే షూట్‌లో చేరిపోగా.. సూర్య మరో రెండు రోజుల్లో చిత్రీకరణలో జాయిన్ కానున్నాడని తెలుస్తుంది.ఈ పోర్షన్‌లో సూర్యకు సంబంధించిన షూట్ మొత్తం పూర్తి కానుందని సమాచారం.
కంగువ మూవీ లో సూర్య సరసన దిశాపటానీ హీరోయిన్ గా నటిస్తుంది.బాబీడియోల్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.కంగువ ౩డీ ఫార్మాట్‌లో కూడా విడుదల కానుంది.. ఈ మూవీకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు సంగీతం అందిస్తున్నాడు. గతానికి, ప్రస్తుతకాలానికి మధ్య ఉండే కనెక్షన్‌తో సాగే స్టోరీలైన్ ఆధారంగా వస్తోన్న కంగువ మూవీ లో సూర్య వారియర్ గా లీడర్ గా డిఫరెంట్ షేడ్స్‌లో వున్న సరికొత్త అవతార్‌లో కనిపించబోతున్నట్టు ఇప్పటివరకు వచ్చిన రషెస్ చెబుతున్నాయి. సూర్య మరోవైపు సుధా కొంగర డైరెక్షన్‌లో సూర్య 43లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకే సూర్య, సుధా కొంగర కాంబోలో వచ్చిన “ఆకాశమే నీ హద్దురా “ మూవీ భారీ విజయం సాధించడంతో ఈ సినిమాపై కూడా భారీగా అంచనాలు వున్నాయి.
