NTV Telugu Site icon

GPS : ద్యావుడా.. జీపీఎస్ ఎంత పని చేసింది ?

New Project (35)

New Project (35)

GPS : సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నా కొద్ది మనిషి సోమరితనానికి అలవాటు పడిపోతున్నాడు. ఏ చిన్న పనికైనా టెక్నాలజీనే ఉపయోగించుకుంటున్నాడు. స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ఇది మరీ ఎక్కువైంది. టెక్నాలజీని, సాంకేతిక పరికరాలను ప్రజలు గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఇలా నమ్మి కొంత మంది పర్యాటకులు తమ ప్రాణాలపైకి తెచ్చుకున్నారు. తెలియని ప్రదేశాలకు వెళ్తే కారులోని గూగుల్ మ్యాప్స్, జీపీఎస్ మీదే ఆధారపడిన పర్యాటకులు నేరుగా సముద్రంలో పడిపోయారు. ఈ ఘటన అమెరికాలోని హవాయిలో జరిగింది. జీపీఎస్ ఆన్ చేసుకుని కారు నడిపిన యాత్రికులు ఆ కారును ఏకంగా సముద్రంలోకి తీసుకెళ్లారు.

వివరాల్లోకి వెళితే.. ఓ కుటుంబం హవాయికి వచ్చింది. అక్కడ ప్రదేశాలు కొన్నింటిని తిలకించారు. ఆ తర్వాత ఇద్దరు మహిళలు కారులో బయలుదేరారు. ఒక మహిళ జీపీఎస్ సాయంతో కారు నడిపింది. అయితే రాంగ్ డైరెక్షన్స్ కారణంగా.. కారుని నేరుగా సముద్రంలోకి తీసుకెళ్లింది. అంతే, కారు నీళ్లలో పడింది.కారు నీళ్లలో మునగడం స్టార్ట్ అయ్యింది. ఇంతలో అక్కడే ఉన్న బోటు సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. కారులో ఉన్న ఇద్దరు మహిళలను తాళ్ల సహాయంతో రక్షించారు. ఆ తర్వాత కారు నీటిలో మునిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరు మహిళలు ప్రాణాలతో బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఏ మాత్రం తేడా జరిగినా.. కారుతో సహా ఆ ఇద్దరు కూడా నీటిలో మునిగి జలసమాధి అయ్యేవారని నెటిజన్లు అంటున్నారు. హార్బర్ లో ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు ఎక్కిన ఆ ఇద్దరు మహిళలు. హార్బర్‌లో మాంటా రే స్నార్కెల్ టూర్ కంపెనీని కనుగొనడానికి ప్రయత్నించారు. ఇందుకోసం జీపీఎస్ మీద డిపెండ్ అయ్యారు. అది కాస్తా బెడిసికొట్టింది.

ఏదైనా కొత్త ప్లేస్ కి వెళ్లాలంటే ప్రస్తుతం చాలామంది వీటి మీదే డిపెండ్ అవుతున్నారు. ఎవరినీ అడగాల్సిన పనే లేదు కదా అనీ. పైగా, అవైతే చాలా కచ్చితంగా పని చేస్తాయని, గమ్య స్థానాలకు చేరుస్తాయని ఓ గుడ్డి నమ్మకం. అయితే, అన్ని సందర్భాల్లో వీటిని నమ్ముకోవడం, వాటి మీదే ఆధారపడటం అంత మంచిది కాదు. వాటి కారణంగా ఒక్కోసారి ప్రమాదాల బారిన పడొచ్చు. ప్రాణాలకే ప్రమాదం ఏర్పడొచ్చు.

Show comments