NTV Telugu Site icon

Tirupati Zoo Park Incident: తప్పతాగి సింహంతో గేమ్స్‌ ఆడబోయాడు.. చివరికి..!

Tirupathi Zoo Park

Tirupathi Zoo Park

Tirupati Zoo Park Incident: తిరుపతి జూపార్క్ ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతుడు ప్రహ్లాద్‌ గుర్జార్‌ సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూకినట్లు తేలింది. సింహం తలను ముట్టుకుంటానని, అనుమతించాలని సెక్యూరిటీ సిబ్బందితో గొడవకు దిగినట్లు తెలిసింది. వారు ఎంతకు అనుమతించకుండా ప్రహ్లాద్‌ గుర్జార్‌ను బయటకు పంపించివేశారు. అతడు బయటకు వెళ్లినట్లే వెళ్లి సెక్యూరిటీ సిబ్బంది సింహం ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే సింహం అతడిపై దూకి చంపేసింది.

Read Also: Mekathoti Sucharita: దండాలయ్యా.. మహారాజై నువ్వు ఉండాలయ్యా.. జగన్‌పై పాటపాడిన సుచరిత

అయితే రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్ గుర్జార్ వృత్తిరీత్యా డ్రైవర్ పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం హైదరాబాద్ నుండి టిక్కెట్ కొని బస్సులో తిరుపతి వచ్చినట్లు గుర్తించారు పోలీసులు. అయితే ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతోనే నిషేదిత ప్రాంతమైన లయన్ ఎన్ క్లోజర్‌లోకి అతను దూకినట్లు భావిస్తున్నారు జూ పార్క్ అధికారులు. మగసింహం అతడిపై దాడి చేసి చంపేసింది. దీంతో ప్రహ్లాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. లయన్‌ సఫారీకి వచ్చిన సందర్శకులు సింహం దాడిని గుర్తించి పెద్దగా కేకలు వేయడంతో అధికారులు స్పందించిన సింహాన్ని బోన్‌లోకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.డెడ్ బాడి పోస్టు మార్టమ్ నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు.