NTV Telugu Site icon

Rajasthan: ఒంటరి మహిళలే టార్గెట్.. ఎదిరిస్తే బెదిరింపులు.. కత్తులతో దాడులు

Woman

Woman

Rajasthan: కొందరు దుండగులు డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారు. డబ్బు, బంగారం ఉన్నవారిని టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో.. బాధితులు తిరగబడితే కొన్ని కిరాతక చర్యలకు పాల్పడుతున్నారు. రోడ్డుపై ఒంటరిగా ప్రయాణిస్తూ బైక్ లపై వచ్చి స్నాచింగులకు పాల్పడుతున్నారు. అదే విధంగా.. ఒంటరి వ్యక్తులుంటున్న ఇళ్లను టార్గెట్ చేసి.. అద్దె కోసమనో లేక దాహం వేస్తుందనో కారణాలతో ఇళ్లంతా చూస్తారు. ఆ తర్వాత.. ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేస్తారు. ఈ దుండగులు పొరపాటున బంగారం, డబ్బు చూస్తే.. దాని కోసం ఏమైనా చేస్తారు.

తాజాగా రాజస్థాన్‌లోని జైపూర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 100 ఏళ్ల వృద్ధురాలు గంగాదేవి కాళ్లను దొంగలు కత్తులతో నరికివేశారు. ఆ ప్రాంతంలో ఓ వృద్ధురాలు ఒంటరిగా ఉండటాన్ని దుండగులు గమనించారు. వారు వెంటనే ఆమె వద్దకు చేరుకున్నారు. అదే విధంగా.. కడియాల కాళ్లకు కన్నేశారు. ఈ క్రమంలో ఆమె వద్దకు వెళ్లి కత్తులతో దాడి చేశారు. ఆమె కాళ్లు నరికి కడియాలను తీసుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత అక్కడ తెగిపడిన కాలు కూడా ఉండటాన్ని స్థానికులు గమనించారు. వృద్ధురాలిని వెంటనే జైపూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు అత్యవసర విభాగంలో చికిత్స పొందుతోంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కత్తులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Flipkart Diwali Sale: వచ్చేస్తోంది..ఫ్లిప్‌కార్ట్‌ దివాళీ సేల్‌..! 80 శాతం మేర భారీ తగ్గింపు..!

మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నెల క్రితం జరిగిన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లోని మనేంద్రగఢ్ జిల్లా కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు షానవాజ్, మరికొందరి కలిసి ఓ బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. షానవాజ్ బాలికను మాయమాటలు చెప్పి హోటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ మరికొందరితో కలిసి ఆమెపై లైంగికంగా వేధింపులు జరిపారు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని బాలికను బెదిరించారు. ఈ క్రమంలో ఆ యువతి కొన్ని రోజులుగా భయంతో ఉండిపోయింది. అయితే చివరకు కుటుంబ సభ్యులు, స్థానికులతో కలిసి చిర్మిరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడితో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.