NTV Telugu Site icon

Salaar 2 : ప్రభాస్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్.. ఆ సినిమా ఇక లేనట్టే..?

Salaar 2

Salaar 2

Salaar 2 : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన “సలార్ సీజ్ ఫైర్ 1 ” గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఈ సినిమాను కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు.సలార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ సాధించింది.ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.మలయాళం స్టార్ హీరో పృధ్విరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా నటించాడు.ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయం సాధించిన సలార్ సినిమాకు సెకండ్ పార్ట్ శౌర్యంగపర్వము ఉంటుంది అని సలార్ మూవీ ఎండింగ్ లో మేకర్స్ తెలిపారు.

Read Also :Bhaje Vaayu Vegam : కార్తికేయ ‘భజే వాయు వేగం’ ట్రైలర్ అదిరిపోయిందిగా..

అయితే మొన్నటి వరకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ కల్కి షూటింగ్ పూర్తి కాగానే సలార్ పార్ట్ 2 షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు వార్తలు వచ్చాయి.అయితే తాజాగా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ ,ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రానున్న మూవీ షూటింగ్ ఆగస్టు లో మొదలు కానున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.దీనితోప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు.అయితే తాజాగా  సలార్ 2 మూవీ ఆగిపోయినట్లు ఫిల్మ్ వర్గాల నుండి సమాచారం..ప్రశాంత్ ,ప్రభాస్ మధ్య కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఈ సినిమా ఆగిపోయినట్లు అనుకుంటున్నారు. అలాగే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాకు కమిట్ అవ్వడంతో ఈ ఏడాది ప్రశాంత్ నీల్ ఆ సినిమాతో బిజీ అవ్వనున్నట్లు తెలుస్తుంది.

Show comments