Shocking: కేరళలో 68 ఏళ్ల వృద్ధుడు చితి పేర్చుకుని ఆత్మాహుతి చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలోని పుత్తురు జిల్లాకు చెందిన విజయకుమార్ (68) అనే వృద్ధుడు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆరోగ్యం సహకరించకపోవడంతో గత కొంతకాలంగా పనులకు వెళ్లడం కూడా మానేశాడు. దీంతో పూర్వీకుల నుంచి తనకు సంక్రమించిన ఇంట్లో ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో వృద్ధుడు నివాసం ఉంటున్న ఇంటి నుంచి గురువారం అర్ధరాత్రి మంటలను రావడాన్ని తన సోదరి గమనించింది.
Read Also: Doctor Uniform : ఆస్పత్రులకు అలా వస్తామంటే ఇక కుదరదు
వెంటనే స్థానికులు గుమికూడి పోలీసులకు సమాచారం అందించారు. అప్పటి వరకు అందరూ ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని ఉండవచ్చని భావించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వచ్చి తనిఖీలు నిర్వహించారు. ఆ ప్రదేశంలో వృద్ధుడు రాసిపెట్టిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐతే సూసైడ్ నోట్‌లోని విషయాలు అందరినీ విస్మయానికి గురిచేశాయి. తన స్నేహితుడికి రాసిన లేఖలో.. తను అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.