NTV Telugu Site icon

West Bengal : భర్త కిడ్నీ రూ.10 లక్షలకు అమ్మి.. డబ్బు తీసుకుని ప్రియుడితో పరారైన కిలాడీ లేడీ

New Project (40)

New Project (40)

West Bengal : పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక మహిళ తన భర్త కిడ్నీని అమ్మమని బలవంతం చేసింది. కిడ్నీ అమ్మగా వచ్చిన రూ. 10 లక్షలను తన దగ్గరే ఉంచుకుంది. ఇది తన కూతురి చదువుకు ఉపయోగపడుతుందని చెప్పింది. దీంతో భార్యను భర్త గుడ్డిగా నమ్మేశాడు. కానీ ఆ మహిళ తన భర్తను నిలువునా ముంచింది. రాత్రికి రాత్రే ఆ మహిళ తన ప్రేమికుడితో పారిపోయింది. నిస్సహాయుడైన భర్త ఆ మహిళపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశాడు. ఈ సంఘటన హౌరా జిల్లాలోని సంక్రైల్‌లో జరిగింది. బాధితుడి కుటుంబంలో భార్య, 10 సంవత్సరాల కుమార్తె ఉన్నారు. అతని ఆదాయం అతని కూతురి చదువు ఖర్చులకు సరిపోలేదు. కాబట్టి భార్య తన భర్తతో మీ కిడ్నీని అమ్మేయండి. దీంతో మన ఆర్థిక సమస్యలు అన్నీ తీరుతాయని నమ్మబలికింది.

కానీ అతని భార్య అతని కిడ్నీని అమ్మమని నిరంతరం ఒత్తిడి చేస్తూనే ఉంది. ఒక కిడ్నీతో కూడా మీ పని పూర్తవుతుంది. కానీ డబ్బు లేకపోవడం వల్ల మన కూతురి భవిష్యత్తును తీర్చిదిద్దలేకపోతే, అది మీదే తప్పు అవుతుంది. మీ కూతురి భవిష్యత్తును నాశనం చేయడానికి మీరే బాధ్యత వహించాలని నిరంతరం ఎత్తిపొడుస్తూనే ఉంది. కానీ దీని వెనుక తన భార్య ఉద్దేశాన్ని తను పసిగట్టలేకపోయాడు. తన కూతురి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అతను తన కిడ్నీని అమ్మడానికి అంగీకరించాడు.

Read Also:Groom Dance: ‘‘చోలీ కే పీచే క్యాహై’’కి వరుడు డ్యాన్స్.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు తండ్రి..

అతను తన కిడ్నీ ఎవరైనా కొంటారేమోనని నెల రోజుల పాటు వెతికాడు. ఒక నెల తర్వాత అతని కిడ్నీ మళ్ళీ రూ. 10 లక్షలకు అమ్ముడైంది. ఇద్దరూ కలిసి కిడ్నీ కొంటున్న వ్యక్తి దగ్గరకు వెళ్లి డబ్బు తెచ్చారు. దీని తరువాత భార్య ఈ డబ్బు నాకు ఇవ్వు అని చెప్పింది. ఉదయం రాగానే నేను ఈ మొత్తాన్ని బ్యాంకులో జమ చేస్తాను. దీంతో తన భార్యే కదా అని అంగీకరించాడు. అతను ఆ డబ్బును తన భార్యకు ఇచ్చాడు. కానీ భార్య ఆ డబ్బులు తీసుకుని రాత్రే ఇంటి నుంచి పారిపోయింది. కొన్ని రోజుల తరువాత శుక్రవారం తన భార్య బరాక్‌పూర్‌లోని సుభాష్ కాలనీలో రవిదాస్ అనే వ్యక్తితో నివసిస్తున్నట్లు భర్తకు తెలియగానే అతను తన కుటుంబంతో అక్కడికి చేరుకున్నాడు.

అప్పుడు ఆమె ఇంట్లోనే ఉండి తలుపు గడియపెట్టుకుంది. ఏం చేసుకుంటావో చేసుకో నీకు విడాకులు పంపిస్తాను అని గట్టిగా అరిచేసింది. కనీసం తన పదేళ్ల కూతురు మీద కూడా జాలి చూపించలేకపోయింది. ఇప్పుడు ఆ పెయింటర్ రవిదాస్, అతని భార్యపై కేసు పెట్టాడు. ఈ కేసులో తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.

Read Also:KL University: న్యాక్ అక్రిడేషన్ కోసం లంచాలు.. KL యూనివర్సిటీపై సీబీఐ కేసు