Site icon NTV Telugu

Shocking Incident: మరీ ఇంత దారుణమా.. డ్రైవర్‌ను జేసీబీకి కట్టేసి చితకబాదిన రౌడీ షీటర్..!

Shocking Incident

Shocking Incident

Shocking Incident: రాజస్థాన్‌లోని బేవార్ జిల్లా రాయపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన కాస్త ఆలశ్యంగా వెలుగులోకి వచ్చింది. గుడియా గ్రామానికి చెందిన చరిత్రాపాతి తేజపాల్ సింగ్ ఉదావత్ అనే వ్యక్తి, తన సొంత డ్రైవర్‌ను జేసీబీకి తలకిందులుగా కట్టేసి, బెల్ట్‌తో దారుణంగా కొట్టాడు. ఈ హింసాత్మక ఘటన సుమారు మూడు గంటల పాటు కొనసాగింది. డ్రైవర్ గాయపడిన తరువాత కూడా, అతని వదలకుండా గాయాలపై ఉప్పు రుద్ది తీవ్రంగా వేధించారు. ఈ ఘటన మూడు నెలల క్రిందట జరిగిందని, అయితే ఈ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ప్రసతుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Read Also: OnePlus 13s: ఆల్ సెట్.. స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 6.32 అంగుళాల డిస్ప్లే తో లాంచ్ కాబోతున్న వన్‌ప్లస్ 13ఎస్..!

తేజపాల్ సింగ్ ఉదావత్ గుడియా గ్రామానికి చెందినవాడు. అతనికి గ్రామ సమీపంలో ఒక ఫార్మ్‌హౌస్ ఉంది. అక్కడ జేసీబీలు, డంపర్లు ఇంకా అనేక ఇతర వాహనాలు ఉంటాయి. సమాచారం ప్రకారం, తేజపాల్ అనధికార గ్రావెల్ తవ్వకాలు, రవాణా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఇతని మీద రాయపూర్ పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే అనేక కేసులు నమోదు అయ్యాయి. ఇక ఈ ఘటనకు సంబంధించి.. సుమారు మూడు నెలల క్రితం, తేజపాల్ తన డ్రైవర్‌ను డీజిల్ దొంగతనంపై అనుమానంతో పట్టుకొని, జేసీబీకి తలకిందులుగా కట్టాడు. అనంతరం బెల్ట్‌తో కొట్టి గాయపరిచాడు. గాయాలపై ఉప్పు రుద్దడంతో డ్రైవర్ తీవ్రంగా శారీరక బాధను అనుభవించాడు.

Read Also: Shehbaz Sharif: ఆ మూడింటిపై భారత్‌‌తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్న పాక్ ప్రధాని

ఇక ఈ ఘటన జరుగుతున్న సమయంలో ఫార్మ్‌హౌస్ వద్ద చాలా మంది వ్యక్తులు ఉన్నప్పటికీ, ఎవరూ అతడిని రక్షించడానికి ముందుకురాలేదు. ఎందుకంటే తేజపాల్ భయంతో అందరూ సైలెంట్ గా ఉంది పోయారు. అతనికి ఎవరు ఎదురు మాట్లాడినా, వాళ్లకు కూడా అదే శిక్ష పడేది అనే భయమే అందరినీ వెనక్కి నెట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటపడిన వెంటనే, పోలీసులు అప్రమత్తమై తేజపాల్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. ఇక ఈ హింసాత్మక ఘటనపై మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ డోతసారా కూడా తీవ్రంగా స్పందించారు.

రాజస్థాన్‌లో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కాదు, మాఫియాలే పాలిస్తున్నారని వారు వ్యాఖ్యానించారు. గతంలో కూడా ఇలాంటి భయానక ఘటనలు జరిగాయని, బీజేపీ పాలనలో మాఫియాల దుర్మార్గం తన గరిష్ఠ స్థాయికి చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరాన్ని చేసిన తేజపాల్‌పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, దౌర్జన్యానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Exit mobile version