మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. 61 ఏళ్ల వృద్ధుడితో 28 ఏళ్ల యువతి హనీ ట్రాప్ కేసు సంచలనం సృష్టించింది. ఈ వివరాలు విన్న పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. బాధిత వృద్ధుడి అశ్లీల వీడియోను తీసి.. రూ.50 లక్షలు డిమాండ్ చేసిందని ఆరోపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. 28 ఏళ్ల మహిళను అరెస్టు చేశారు.
READ MORE: Kamal Hasan : కమల్ కోసం గొడవ పడ్డాను.. శివరాజ్ కుమార్ ఇంటరెస్టింగ్ కామెంట్స్..
పోలీసుల సమాచారం ప్రకారం.. బిచోలి మర్దానా గ్రామానికి చెందిన బాధితుడు మదన్ సింగ్(61) ఇండోర్‌లోని మక్వానా కాంప్లెక్స్‌లోని ఒక సూపర్ మార్కెట్‌కు తన దుకాణాన్ని అద్దెకు ఇచ్చాడు. వినీత్ జైన్ అనే వ్యక్తి ఆ సూపర్ మార్కెట్ నడుపుతున్నాడు. ఆ భవన యజమాని అయిన 61 ఏళ్ల వృద్ధుడు మదన్ సింగ్ దుకాణానికి వచ్చి వెళ్ళేవాడు. పహాడీ టేక్రిలో నివాసముంటున్న సంతోష్ మానవత్ భార్య వైశాలి(28) ఇదే షాపులో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తుంది. దుకాణంలోకి వస్తూ పోతూ ఉండగా మదన్ సింగ్‌తో మాటలు కలిపింది. రెండేళ్ల కిందట వైశాలి వృద్ధుడికి ఫోన్ చేసి కలవమని కోరింది. ఆ వృద్ధుడిని తన బుట్టలో వేసుకుంది. మదన్ సింగ్ ఆమెను తన కారులో తిప్పాడు. అలాగే కారులో ఉజ్జయినికి వెళ్లారు. అక్కడ రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక హోటల్‌లో గది తీసుకున్నారు. నిందితురాలు వైశాలి మదన్ సింగ్ ని ఆహారం తీసుకురామని గది నుంచి బయటకు పంపింది. ఇంతలో వైశాలి తన మొబైల్ ఫోన్‌ను వీడియో రికార్డింగ్ మోడ్‌లో పెట్టి దాచింది. ఆహారంలో సైతం ఏదో కలిపింది. అది తిన్న మదన్ సింగ్ స్పృహ తప్పి పడిపోయాడు. ఆ తర్వాత వైశాలి వృద్ధుడితో అసభ్యకరమైన రీతిలో ఫొటోలు, వీడియోలు తీసుకుంది.
READ MORE: JK: భర్తను దారుణంగా చంపిన భార్య, కుటుంబీకులు.. మృతదేహాన్ని ఏం చేశారంటే..?
కొన్ని రోజుల తర్వాత.. వైశాలి ఆ మదన్ సింగ్ కి ఫోన్ చేసి ఫొటోలు, వీడియోలు బయట పెడతానని బెదిరించింది. నిందితురాలు వైశాలి మదన్ సింగ్ ని దుకాణానికి పిలిపించి ఒక వీడియో చూపించింది. కుటుంబ సభ్యులకు చెబుతానని చెప్పింది. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి పరువు తీయడమే కాకుండా, జైలుకు పంపుతామని బెదిరించింది. బాధితుడు ఈ వయసులో ఇవన్నీ బయటపడితే బాగుండదని భావించాడు. దీంతో వాటిని డిలీట్ చేయడానికి వైశాలి రూ.50 లక్షలు డిమాండ్ చేసింది. బాధితుడు రూ.19 లక్షలు చెల్లించడానికి రూ.500 స్టాంప్ పేపర్‌పై ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత కొంత మొత్తాన్ని వైశాలికి నగదు రూపంలో, కొంత మొత్తాన్ని చెక్కు ద్వారా ఇచ్చాడు. వీడియోలు, ఫొటోలు డిలీట్ చేయమని అడిగితే.. మొబైల్ ఫోన్ తన సోదరుడి వద్ద ఉందని, వీడియో ఫోటోలను తొలగిస్తానని చెప్పింది. కొన్ని రోజుల తర్వాత మళ్లీ రూ.5 లక్షలు డిమాండ్ చేయగా.. అతడు ఇచ్చాడు. ఇంతటితో ఆగకుండా.. వైశాలి మళ్ళీ రూ.11 లక్షలు డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
