ICC USA: అమెరికా (USA) క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని ఐసీసీ తక్షణమే సస్పెండ్ చేసింది. సెప్టెంబర్ 23న వర్చువల్ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది ఐసీసీ కమిటీ. 2024లో జరిగిన T20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌ను ఓడించి అద్భుత ఆరంభం చేసిన అమెరికా జట్టుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) గట్టి షాక్ ఇచ్చింది. అయితే, ఈ చర్యతో చేపట్టినా USA జట్టు వచ్చే ఏడాది జరగనున్న T20 వరల్డ్ కప్‌లో మాత్రం ఆడనుంది.
Crime News: సినిమా స్టోరీకి మించిన కథ.. దోపిడీ ముసుగులో భార్యను కిరాతకంగా చంపించిన భర్త!
అందిన నివేదిక ప్రకారం, ఐసీసీ సభ్యుడిగా USA క్రికెట్ తన బాధ్యతలను పదేపదే విస్మరించడం వల్ల ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా USA క్రికెట్‌పై అనేక ఫిర్యాదులు ఐసీసీ దృష్టికి వచ్చాయి. గత సంవత్సరం శ్రీలంకలో జరిగిన వార్షిక సమావేశంలోనే ఐసీసీ USA క్రికెట్ బోర్డుకు నోటీసు ఇచ్చింది. ఈ ఏడాది సింగపూర్‌లో జరిగిన సమావేశంలో USA క్రికెట్‌ను సరిదిద్దుకోవడానికి మూడు నెలల గడువు ఇచ్చారు. కానీ, సరైన నిర్మాణం తీసుకురావడంలో విఫలమవడంతో ఐసీసీ చివరికి సభ్యత్వం రద్దు చేసింది.
USA క్రికెట్ బోర్డులో నిర్వహణా సమస్యలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. బోర్డు చైర్మన్ వేణు పిసికే, ఐసీసీతో పాటు యునైటెడ్ స్టేట్స్ ఒలింపిక్ అండ్ పారా ఒలింపిక్ కమిటీ (USOPC) ఇచ్చిన మార్గదర్శకాలను పట్టించుకోలేదు. ముఖ్యంగా బోర్డు లీడర్‌షిప్ మార్పు అవసరమని సూచించినప్పటికీ, బోర్డు దానిని అంగీకరించలేదు. గత ఏడాది T20 వరల్డ్ కప్ అనంతరం జూలైలోనే ఐసీసీ ఈ విషయమై నోటీసు పంపింది. అందులో ఒక సంవత్సరంలో సమస్యలను పరిష్కరించమని గడువు ఇచ్చింది. కానీ, గడువు ముగిసినా మార్పు లేకపోవడంతో 2025 జూలైలో సింగపూర్‌లో జరిగిన బోర్డు సమావేశంలో మరో మూడు నెలల సమయం ఇచ్చారు. అయినప్పటికీ బోర్డు తన నిర్ణయాలపై మొండిగా నిలవడంతో సభ్యత్వాన్ని సస్పెండ్ చేశారు.
OG : ఓజీ’లో తన పాత్రపై ఎమోషనల్ కామెంట్స్ చేసిన శ్రియా రెడ్డి!
ఈ సస్పెన్షన్‌తో USA క్రికెట్‌లో పెద్ద మార్పులు రావచ్చని అంచనా. అయితే 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో జరగనున్న క్రికెట్ టోర్నమెంట్‌పై ఈ నిర్ణయం ప్రభావం చూపదు. ఆతిథ్య దేశం కావడంతో USA జట్టు ఆ టోర్నమెంట్‌లో నేరుగా పాల్గొనే ఆరు జట్లలో ఒకటిగా ఉండే అవకాశం ఉంది.
