Site icon NTV Telugu

Nara Lokesh: ఏపీలో 81 లక్షల మంది నిరక్షరాస్యులు.. మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు..

Nara Lokesh

Nara Lokesh

ఏపీలో 81 లక్షల మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు తేలింది. 15 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సులో నిరక్షరాస్యులు ఉన్నారు. విద్యాశాఖ సమీక్షలో మంత్రి నారా లోకేశ్ విస్మయం వ్యక్తం చేశారు. వయోజనా విద్యా మిషన్ తక్షణం ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే.. ‘అందరికీ విద్య (వయోజన విద్య)లో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లాస్‌ (అండర్‌ స్టాండింగ్‌ ఆఫ్‌ లైఫ్‌లాంగ్‌ లర్నింగ్‌ ఫర్‌ ఆల్‌ ఇన్‌ సొసైటీ) కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.

READ MORE: Israel- France: ఇజ్రాయెల్‌కు ఫ్రాన్స్ ద్రోహం.. ముస్లింలను చంపడానికి ఆయుధాలు ఇవ్వమని వెల్లడి

ఈ పథకం కింద 15 ఏళ్ల వయసు పైబడి ప్రాథమిక విద్యకు నోచుకోనివారు, మధ్యలోనే బడి మానేసి అక్షరాలు మరచిపోయిన వారిని గ్రామస్థాయిలో గుర్తిస్తారు. వీరి విద్యా బోధనకు ఇప్పటికే స్వయం సహాయక సంఘాల నాయకురాళ్లను వాలంటీర్లుగా ఎంపిక చేశారు. ప్రతిరోజు రెండు గంటల (సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు) పాటు సచివాలయం, అంగన్‌వాడీ కేండ్రాలు, సామాజిక భవనాలు లేదా అందరికీ ఆమోదమైన ప్రదేశంలో విద్యాబోధనకు సిద్ధం చేస్తారు. వీరికి ప్రత్యేక పుస్తకాలు ఉంటాయి. ప్రాజెక్టు కింద చదవడం, రాయడం, సంఖ్యా జ్ఞానం పొందడం, వీడియో రూపంలో బోధన ఉంటుంది.

READ MORE: Chevireddy Bhaskar Reddy: తుడా నిధుల దుర్వినియోగం ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే రియాక్షన్..!

Exit mobile version